ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. కాలిపోయిన..
X
ఖమ్మం జిల్లా ఇల్లందు ప్రభుత్వ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో హాస్పిటల్ లోని మూడు గదుల్లో ఉన్న మందులు, పరికరాలు పూర్తిగా దగ్దం అయ్యాయి. ఈ ప్రమాదంలో రోగులకు ఎటువంటి హాని జరుగలేదని హాస్పిటల్ సిబ్బంది తెలిపింది. ప్రమాదం గురించి తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
అయితే, ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని విచారణలో తేలింది. దాంతో మంటలు చెలరేగి.. ఫ్రిజ్ సహా పూర్తి పరికరాలు మంటల్లో కాలిపోయాయని హాస్పిటల్ సిబ్బంది తెలిపింది. వీటి ధర సుమారు రూ. 3 లక్షల వరకు ఉండొచ్చు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు విధాన పరిషత్ లోకి మారిన తర్వాత పూర్తి స్థాయిలో రిపేర్లు చేపట్టారు. ఇందులో భాగంగానే హాస్పిటల్ లో విద్యుత్ సౌకర్యాన్ని మెరుగు పరిచారు. వారం రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా ఈ షార్ట్ సర్క్యూట్ జరిగిందని తెలిపారు.