Home > క్రైమ్ > ఖమ్మంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

ఖమ్మంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

ఖమ్మంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
X

ఖమ్మం జిల్లా వైరా మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్టేజీ పినపాక వద్ద లారీ, కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఏడాదిన్నర పాప ఉంది. క్షతగాత్రులను ఖమ్మంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. బాధితులను సత్తుపల్లి నియోజవర్గ పరిధిలోని కల్లూరు మండలం లాక్యాతండాకు చెందిన వారిగా పోలీసులు చెబుతున్నారు. కారును లారీ ఢీ కొన్న తర్వాత కొంత దూరం ఈడ్చుకెళ్లడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


Updated : 9 Jun 2023 4:26 PM IST
Tags:    
Next Story
Share it
Top