TSRTC రాజధాని బస్సులో అగ్ని ప్రమాదం.. ప్రయాణికులు సేఫ్
అర్ధరాత్రి వేళ అనుకోని ప్రమాదం
X
హైదరాబాద్‌లో ఓ టీఎస్ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఎగిసి పడడంతో బస్సు పూర్తిగా కాలి బూడిదయ్యింది. డ్రైవర్ అప్రమత్తత కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. బస్సు హైదరాబాద్ BHEL నుంచి గుంటూరు వెళ్తుండగా ఘటన జరిగింది. ఒక్కసారిగా బస్సు మొత్తానికి మంటలు అంటుకున్నాయి. డ్రైవర్ మిర్రర్‌లో మంటలను చూసి బస్సు ఆపి.. ప్రయాణికులు అప్రమత్తం చేయడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 45 మంది ప్రయాణికులు ఉన్నారు.
పెద్ద అంబర్ పేట్ ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగడంతో.. ఇంజన్ తో సహా బస్సు ముందు భాగం మొత్తం దగ్ధం అయింది. ఫ్యూయల్ లీకేజ్ లేదా షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. డ్రైవర్ అప్రమత్తత వల్లే ఈ పెను ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా వ్యాపించిన మంటలు చూసి.. ప్రయాణికులను అలర్ట్ చేయడంతో అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం అనంతరం ప్రయాణికులను మరో బస్సులో పంపించారు అధికారులు.