సినిమా ట్విస్టుల్లా ఏపీ క్రైమ్ రేట్.. ఒకేరోజు ఐదుగురు యువతుల మిస్సింగ్
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల మిస్సింగ్ కేసులు ఆగడం లేదు. రోజు రోజుకు మిస్సింగ్ కేసులు పెరుగుతుంటే.. వాటిని పరిష్కరించలేక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. గురువారం (ఆగస్టు 17) ఒక్కరోజే ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఐదుగురు యువతులు అదృశ్యం అయ్యారు. దీంతో ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. తిరుపతి ఒజిలికి చెందిన నందిని, కుప్పం పట్టణానికి చెందిన రమ్య, కీర్తి, పీలేరుకు చెందిన సానిఫా, కేవీ పల్లెకు చెందిన రమ్యాశ్రీ కనపడకుండా పోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఆధారంగా జాడ కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. కళ్లముందు తిరిగిన కూతుళ్లు కనిపించట్లేదనే వార్తను యువతుల తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆధికారుల చుట్టూ తిరుగుతు కన్నీరుమున్నీరవుతున్నారు.
చిత్తూరు జిల్లాలో ఒక్కరోజే ఐదుగురు యువతుల అదృశ్యం
— Telugu Scribe (@TeluguScribe) August 18, 2023
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గురువారం ఒక్క రోజే ఐదుగురు యువతులు అదృశ్యం అవ్వడం కలకలం రేపింది. తిరుపతి ఒజిలికి చెందిన నందిని, కుప్పం పట్టణానికి చెందిన రమ్య, మరో యువతి కీర్తి, కేవీ పల్లెకు చెందిన రమ్యశ్రీ, పీలేరుకు చెందిన సానిఫా కనపడ… pic.twitter.com/8h4tH4Xi3G