Home > క్రైమ్ > వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని.. కన్నే తల్లే కసాయి దానిలా..

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని.. కన్నే తల్లే కసాయి దానిలా..

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని.. కన్నే తల్లే కసాయి దానిలా..
X

వివాహేతర సంబంధం ఓ పసి ప్రాణాన్ని బలిగొంది. కన్నెతల్లే కసాయి దానిలా ప్రవర్తించి.. చిన్నారిని చంపేసింది. కుషాయిగూడ మార్కెట్ వద్ద నివసించే నాయక్ వాడి రమేష్ కుమార్ ఆటో నడుపుతుంటాడు. స్థానికంగా ఉండే రాజబోయిన కళ్యాణి (22)ని 2018లో ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడు. పెళ్లై ఏడాది తర్వాత ముందే తన్విత (నాలుగున్నరేళ్లు) పుట్టింది. ఇక అప్పటి నుంచి కళ్యాణిలో మార్పు రావడంతో.. ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. 2021 నుంచి ఈ ఇద్దరు వేరుగా ఉంటున్నారు. కళ్యాణి పుట్టింట్లో ఉంటూ.. కూరగాయలు అమ్ముతుండేది.

ఆ టైంలోనే కళ్యాణి దూరపు చుట్టం ఇండ్ల నవీన్ (19)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి. వివాహేతర సంబంధానికి దారి తీసింది. తన్వితను అడ్డు తొలగించుకుని.. భర్తకు విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ప్లాన్ ప్రకారం శనివారం (జులై 1) తన్విత స్కూల్ నుంచి ఇంటికి రాగానే కళ్యాణి.. పడుకోబెట్టినట్లు నటించి ముంఖంపై దిండు పెట్టి చంపేసింది. ఆ తర్వాత కళ్యాణి తల్లి ఇంటికి రాగానే.. కూతురు నిద్ర లేవట్లేదని బుకాయించింది. వెంటనే హాస్పిటల్ తరలించగా.. తన్విత అప్పటికే చనిపోయిందని డాక్టర్లు తెలిపారు. విషయం తెలుసుకున్న భర్త రమేష్.. కళ్యాణిపై అనుమానంతో పోలీస్ లకు ఫిర్యాదు చేశారు. కళ్యాణినిని తమదైన శైలిలో విచారించిన పోలీసులు.. తనతో నిజం చెప్పించారు. హత్యకు ఉపయోగించిన దిండుతో పాటు.. రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున, కళ్యాణి, తన ప్రియుడు నవీన్ ను అరెస్ట్ చేశారు.

Updated : 12 July 2023 1:28 PM IST
Tags:    
Next Story
Share it
Top