చికెన్ కూర వండలేదని..భార్యను గొడ్డలితో నరికాడు
X
వివాహ బంధాలు క్షిణికావేషంలో చెల్లాచెదురు అవుతున్నాయి. చిన్న చిన్న కరాణాలకే కోపాలు పెంచుకుని ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్న సంఘటనలు ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా బాగా పెరిగిపోతున్నారు. ఓపికతో, సహనంతో , నూరేళ్ల జీవితాన్ని హాయిగా గడపాలని పెద్దలు చెప్పిన మాటలను పక్కన పెట్టి దంపతులు కాపురంలో కలతలు సృష్టించుకుంటూ తమ జీవిత భాగస్వామ్యులను హతమారుస్తున్నారు. క్షణికావేషంలో జరిగే ఈ దారుణాల వెనుక ఉన్న కారణాలు చూస్తే మాత్రం నివ్వెరపోవాల్సిందే. అలాంటి ఘటనే మంచిర్యాల జిల్లాలో జరిగింది. చికెన్ కూడా వండలేదని కోపంతో రగిలిపోయిన భర్త భార్యను అత్యంత దారుణంగా గొడ్డలితో నరికాడు. స్థానికంగా ఈ సంఘటన సంచలనంగా మారింది.
చెన్నూరు మండలం కిష్టంపేటకు చెందిన 50 ఏళ్ల పోశం తన భార్య 45 ఏళ్ల శంకరమ్మను నచ్చిన కూర వండలేదని దారుణంగా హత్య చేశాడు. రాత్రి చికెన్ వండమని భార్యను కోరితే వంకాయ కూర వండటంతో కోపంతో రగిలిపోయిన పోశం అదే రోజు రాత్రి భార్యను గోడ్డలితో నరికి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థాలానికి చేరుకున్నారు. బాడీని కలెక్ట్ చేసి కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుని కోసం గాలిస్తున్నారు.