భర్త పైశాచికత్వం.. భార్య అందం పోతుందని ఏం చేశాడంటే..
X
పిల్లలు పుడితే అందం పోతుందని ఓ శాడిస్టు భర్త భార్యకు అబార్షన్లు చేయించాడు. గత ఐదేళ్లుగా నరకం చూపిస్తూ.. ఆమెను అమ్మ ప్రేమకు దూరం చేశాడు. వరకట్న వేధింపులతో పాటు వరుసగా అబార్షన్లు చేయిస్తూ తనలోని శాడిజాన్ని బయటపెట్టాడు. అది తట్టుకోలేని భార్య చివరకు పోలీసులను ఆశ్రయించింది. జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గద్వాల పట్టణం గంటగేరికి చెందిన శ్వేతకు.. ఐదేళ్ల క్రితం మల్దకల్ మండలం శేసంపల్లికి చెందిన విజయ్ కుమార్‌తో వివాహం జరిగింది. పెద్దలు కుదిర్చిన ఈ పెళ్లి జరిగిన కొన్నాళ్ల వరకూ విజయ్ కుమార్ బాగానే ఉన్నాడు.
భార్యకు ప్రెగ్నెన్సీ వచ్చిందనే విషయం తెలియగానే.. తనలోని శాడిజాన్ని బయటకు తీశాడు. పిల్లలు పుడితే భార్య అందం పోతుందని ఆమెకు అబార్షన్ చేయించేవాడు. ఇలా పెళ్లైన నాటి నుంచి 2 సార్లు ఆమెకు అబార్షన్ చేయించాడు. తనకు పిల్లలు కావాలని శ్వేత వేడుకున్నా.. అతడి తీరు మారలేదు. భర్త శాడిజానికి తోడు అదనపు కట్నం కోసం అత్తమామలు వేధింపులు కూడా మొదలయ్యాయి. వారి హింసను తట్టుకోలేకపోయిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
మూడు రోజుల క్రితం గద్వాల్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తన భర్త ఓ పార్టీ లీడర్ కావటంతో పోలీసులు కూడా తొలుత ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని బాధితురాలు ఆరోపించింది. తాను ఒత్తిడి చేయంటతో చివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని తెలిపింది. కాగా.., బాధితురాలి విషయం తెలుసుకున్న మహిళా సంఘాలు ఆమెకు మద్దతుగా నిలిచాయి. ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని భర్త ఆమె అత్తమామలను అదుపులోకి తీసుకొని విచారిస్తామని పోలీసులు తెలిపారు.