Home > క్రైమ్ > IIT Guwahati Student : డిసెంబర్ 31న పార్టీ.. వాష్‌రూమ్‌కి వెళ్ళిన యువతి..

IIT Guwahati Student : డిసెంబర్ 31న పార్టీ.. వాష్‌రూమ్‌కి వెళ్ళిన యువతి..

IIT Guwahati Student : డిసెంబర్ 31న పార్టీ.. వాష్‌రూమ్‌కి వెళ్ళిన యువతి..
X

గువాహటిలోని ఓ హోటల్‌లో తెలంగాణకు చెందిన విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలు పుల్లూరి ఐశ్వర్యగా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన అమ్మాయి అస్సాంలోని ఐఐటీ గువాహటి(IIT Guwahati)లో నాలుగో సంవత్సరం బీటెక్‌ చదువుతుంది. నూతన సంవత్సరం వేడుకల్లో బాగంగా ఐశ్వర్యతో పాటు ఆమె ముగ్గురు స్నేహితులు ఐఐటీ క్యాంపస్‌కు 25 కి.మీల దూరంలోని ఓ హోటల్‌లో డిసెంబర్‌ 31న రూమ్‌లు బుక్‌ చేసుకున్నారు. ఆ రోజు స్నేహితులతో సరదాగా గడిపిన ఐశ్వర్య .. మరుసటి రోజు వాష్‌ రూమ్‌లో అచేతన స్థితిలో పడి ఉంది. దీంతో ఆమె స్నేహితులు గువాహటి మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చెపట్టారు. ముందుగా ఐశ్వర్య స్నేహితులను విచారించిన పోలీసులు.. ఆ తర్వాత ఐశ్వర్య ఉన్న హోటల్‌ గదిలో తనిఖిలు చేశారు. అనంతరం హోటల్‌ సిబ్బందిని విచారించారు. డిసెంబర్‌ 31న అర్ధరాత్రి హోటల్‌ తనిఖీలో భాగంగా వెళ్లినప్పుడు ఐశ్వర్యతో పాటు ఇతర స్నేహితులు మత్తులో ఉన్నట్లు సిబ్బంది పోలీసులకు చెప్పారు.

విచారణ అనంతరం.. ఎక్కువగా అల్కహాల్ తీసుకోవడం వల్లనే ఆమె మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఐశ్వర్య, ముగ్గురు స్నేహితులు డిసెంబర్ 31న గౌహతిలోని పల్టాన్ బజార్‌లోని ఒక పబ్‌లో పార్టీ చేసుకున్నారని పోలీసులు తెలిపారు. తర్వాత వారు మద్యం మత్తులో అదే ప్రాంతంలోని హోటల్ గదిని బుక్ చేసుకున్నారని వెల్లడించారు. అధికారిక శవపరీక్ష ఫలితాల తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని పోలీసులు వివరించారు...

ఈ ఘటనపై ఐశ్వర్య కుటుంబ సభ్యులకు ఐఐటీ గువాహటి యాజమాన్యం సమాచారం అందించింది. ఆమె మృతి పట్ల

ప్రగాఢ సానుభూతి తెలిపింది.

Updated : 3 Jan 2024 7:24 AM IST
Tags:    
Next Story
Share it
Top