Home > క్రైమ్ > బతికుండగానే పూడ్చిపెట్టాడు.. ఇండియన్ స్టూడెంట్ దారుణ హత్య

బతికుండగానే పూడ్చిపెట్టాడు.. ఇండియన్ స్టూడెంట్ దారుణ హత్య

బతికుండగానే పూడ్చిపెట్టాడు.. ఇండియన్ స్టూడెంట్ దారుణ హత్య
X

ఉన్నత చదువుల కోసం ఓ యువతి పంజాబ్ నుంచి ఆస్ట్రేలియా వెళ్లింది. అక్కడ ఓ వ్యక్తితో పరిచరం ఏర్పడగా.. అది కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత అతడిలో మార్పు రావడంతో యువతి దూరం పెట్టింది. దీంతో పగ పెంచుకున్న యువకుడు ఆమెను బతికుండగానే పూడ్చిపెట్టి దారుణంగా చంపేశాడు. ఈ ఘటనలో 2021లో జరగ్గా.. పోస్టుమార్టం రిపోర్ట్ ద్వారా హత్య జరిగిన తీరు వెలుగులోకి వచ్చింది.

పంజాబ్‌కు చెందిన జాస్మిన్ కౌర్ నర్సింగ్ చదువు కోసం ఆస్ట్రేలియా వెళ్లింది. అక్కడ ఆమెకు తారిక్‌జోత్‌ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొంతకాలం తర్వాత తారిక్‌ ప్రవర్తనలో మార్పు రాగా.. జాస్మిన్ అతడిని దూరంపెట్టింది. దీనిని జీర్ణించుకోలేని తారిక్ ఆమెపై పగబడ్డాడు. ఆమెను నార్త్‌ పాలింప్టన్ ప్రాంతంలో కిడ్నాప్‌ చేసి ఫ్లిండర్స్‌ రేంజెస్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమె కళ్లకు గంతలు కట్టి, ఆమె శరీరాన్ని కేబుళ్లతో చుట్టి, సజీవంగా పాతిపెట్టాడు.

ఈ ఘటన 2021లో జరిగ్గా.. వెంటనే వెలుగులోకి రాకపోవడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ దృశ్యాలు, ఇతర ఆధారాలను సేకరించిన పోలీసులు.. జాస్మిన్‌ను హత్య చేసింది తారికేనని నిర్ధారించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కోర్టులో అతడు తన తప్పును అంగీకరించాడు. జాస్మిన్ పాతిపెట్టిన ప్రదేశం నుంచి మృతదేహాన్ని వెలికి తీయగా.. పోస్ట్‌మార్టం నివేదికలో అతడు చంపిన తీరు బయటకువచ్చింది.

ఈ కేసులో అసాధారణ క్రూరత్వం ఉందని, ఆమె బతికుండగానే వర్ణించలేని బాధను అనుభవించిందని బాధితురాలి కుటుంబం తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఈ కేసులో నిందితుడికి కోర్టు జీవితఖైదు విధించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. తన కుమార్తెకు జరిగిన అన్యాయంపై జాస్మిన్ తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకోసం తన బిడ్డను విదేశాలకు పంపడమే తాను చేసిన తప్పని బోరున విలపించారు.



Updated : 6 July 2023 10:11 PM IST
Tags:    
Next Story
Share it
Top