Home > క్రైమ్ > పోలీస్ వేషంలో గంజాయి రవాణా...వీడు మాములోడు కాదు..

పోలీస్ వేషంలో గంజాయి రవాణా...వీడు మాములోడు కాదు..

పోలీస్ వేషంలో గంజాయి రవాణా...వీడు మాములోడు కాదు..
X

అతడు చదివింది డిప్లొమా. నగరానికి బతుకుదెరువు కోసం వచ్చి ఉద్యోగంలో చేరాడు. వచ్చిన డబ్బులు జల్సాలకు చాలకపోవడంతో ఈజీ మనీ కోసం అలవాటు పడ్డాడు. సులభంగా డబ్బులను సంపాదించే మార్గాలను అన్వేషించి...గంజాయి అక్రమ రవాణా చేశాడు. తర్వాత సొంతంగా గంజాయి సరఫరా మొదలు పెట్టేశాడు. ఈ క్రమంలో కోట్ల రూపాయలను సంపాదించాడు. చివరికి పోలీసులకు అడ్డంగా దొరికి కటకటాలపాలయ్యాడు. హైదరాబాద్‌లో పోలీస్‌ అవతారంలో గంజాయి రవాణా చేస్తున్న కిలాడీ భాగోతాన్ని పోలీసులు బయటపెట్టారు. ఈ కేసులో సంచలన విషయాలు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం ఏపూరుకు చెందిన వెంకుడోత్‌ వీరన్న అలియాస్ వీరు 2006లో పదో తరగతి పరీక్షలు ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత హైదరాబాద్‌ చేరుకుని ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ పదో తరగతి పరీక్షలు పాస్ అయ్యాడు. 2013లో పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసి కొన్నాళ్లు హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డు విభాగంలో తర్వాత ఆర్కేపురంలోని కార్పొరేట్ కాలేజీలో పనిచేశాడు.

తర్వాత అధికంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో సూర్యాపేట జిల్లా తనమచర్ల మండలంలో ఉండే మేనమామ తేజావత్‌ గంజాయి రవాణకు సాయమందించాడు. తేజావత్‌ గంజాయిని తీసుకు వచ్చే సమయంలో అతనికి వీరన్న కారు డ్రైవర్‌గా వెళ్లేవాడు. గంజాయి రవాణాలో ఎక్కువగా డబ్బుల రావడం గమనించిన వీరన్న కొనేళ్లకు సొంతంగా గంజాయి వ్యాపారం ప్రారంభించాడు. ఈ నేపథ్యంలోనే కోట్లకు పడగలెత్తాడు.

బాగా డబ్బుల సంపాదించిన తర్వాత తన వ్యాపార సామ్రాజ్యాన్ని వీరన్న విస్తరించాడు. ఖరీదైన కార్లు కొనుగోలు చేసి వాటిలో ప్రత్యేక అరలు ఏర్పాటు చేసి దాని ద్వారా గంజాయిని తరలించేవాడు. ఆ కార్లను ఎవరు ఆపకుండా ఉండేందుకు పోలీస్ సైరన్ కూడా పెట్టాడు. మహారాష్ట్రలో ఓ డీలర్‌తో వ్యాపార సంబంధాలు పెంచుకుని.. వ్యాపారాల్లో కూడా పెట్టుబడులు పెట్టాడు. వీరన్న గురించి సమాచారం అందడంతో తెలంగాణ స్టేట్‌ యాంటీ నార్కొటిక్స్‌ బ్యూరో అధికారులు, పోలీసులతో కలిసి పట్టుకున్నారు.ఈ కేసులో ఇద్దరు గ్రేహౌండ్‌ కానిస్టేబుళ్లతో పాటు మొత్తం ఆరుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి 12 లక్షలు విలువ చేసే 44 కిలోల గంజాయి, కోటి విలువచేసే 4 కార్లు , 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Updated : 18 Aug 2023 3:57 PM IST
Tags:    
Next Story
Share it
Top