Home > క్రైమ్ > Jet Airways: జెట్​ ఎయిర్​వేస్​ ఫౌండర్​ నరేశ్​ గోయల్​ అరెస్ట్..

Jet Airways: జెట్​ ఎయిర్​వేస్​ ఫౌండర్​ నరేశ్​ గోయల్​ అరెస్ట్..

Jet Airways: జెట్​ ఎయిర్​వేస్​ ఫౌండర్​ నరేశ్​ గోయల్​ అరెస్ట్..
X

దేశీయ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌(74) అరెస్టు అయ్యారు. కెనరా బ్యాంకుకు సంబంధించి రూ.538 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సంస్థ శుక్రవారం రాత్రి అరెస్టు చేసింది. అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద.. గోయల్‌ను ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ముంబయిలోని ఈడీ కార్యాలయంలో నరేశ్‌ గోయల్‌ను శుక్రవారం సుదీర్ఘంగా విచారించిన అనంతరం ఈడీ అధికారులు అరెస్టు చేశారు.

జెట్‌ ఎయిర్‌ కోసం కెనరా బ్యాంక్‌ నుంచి తీసుకున్న రూ.848.86 కోట్ల రుణాలను దారి మళ్లించి స్వాహా చేశారని సీబీఐ ఇంతకు ముందే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఈ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగానే ఈడీ గోయల్‌ను ప్రశ్నించి.. అరెస్టు చేసింది. మోసం, నేరపూరిత కుట్ర, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, నేరపూరిత దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని పేర్కొంటూ నరేశ్ గోయల్, అనితా గోయల్, గౌరంగ్ ఆనంద శెట్టి తదితరులపై గతేడాది నవంబర్ 11న సీబీఐకి కెనరా బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ పీ సంతోష్ ఫిర్యాదు చేశారు. దీనివల్ల బ్యాంకుకు రూ.538.62 కోట్ల నష్టం వాటిల్లిందని ఆరోపించారు. ఈ కేసులో మనీలాండరింగ్‌ అంశాలు తేలడంతో ఈడీ సైతం దర్యాప్తు చేపట్టింది. గత జులై 20న గోయల్‌, ఆయన భార్య అనిత, కంపెనీకి చెందిన ఇతర అధికారుల ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. జులై 29న 2021న జెట్‌ ఎయిర్‌వేస్‌ మోసం చేసినట్లు సీబీఐ తేల్చింది. గోయల్‌ను శనివారం పీఎంఎల్‌ఏ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం గోయల్‌ కస్టోడియల్‌ రిమాండ్‌ను కోరేందుకు ఈడీ సిద్ధమవుతోంది

దాదాపు 25 ఏళ్ల పాటు నిరంతరాయంగా విమాన సేవలు నిర్వహించిన జెట్ ఎయిర్‌వేస్.. భారీ నష్టాలు, సర్వీసుల నిర్వహణకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో విఫలం కావడంతో 2019 ఏప్రిల్‌లో మూత పడింది. ఆపై బ్యాంకులు నిర్వహించిన వేలంలో జలాన్ కల్రాక్ కన్సార్టియం.. జెట్ ఎయిర్వేస్ సంస్థ బిడ్ సొంతం చేసుకుంనది. ఇక జలాన్ కల్ రాక్ కన్సార్టియం ఆధ్వర్యంలో జెట్ ఎయిర్వేస్ విమాన సర్వీసులు ప్రారంభం కావాల్సి ఉంది. జెట్ ఎయిర్వేస్ సర్వీస్‌లు నిలిచిపోయాక.. 2019 మే 25న విదేశాలకు బయలుదేరి వెళ్లేందుకు నరేష్ గోయల్, ఆయన సతీమణి అనితా గోయల్ ప్రయత్నించారు. ముంబై విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు విమానం ఎక్కడానికి అనుమతి నిరాకరించారు. ఆ టైంలో నరేష్ గోయల్ దంపతులు నాలుగు భారీ సైజ్ సూట్ కేసులతో విదేశాలకు వెళ్లేందుకు సిద్ధం కావడం గమనార్హం.


Updated : 2 Sept 2023 10:17 AM IST
Tags:    
Next Story
Share it
Top