Home > క్రైమ్ > రూ.15 లక్షలు ఇస్తేనే ఫస్ట్ నైట్

రూ.15 లక్షలు ఇస్తేనే ఫస్ట్ నైట్

రూ.15 లక్షలు ఇస్తేనే ఫస్ట్ నైట్
X

నేటి సమాజంలో కొందరూ వ్యక్తులు ప్రవర్తించే తీరుతో సంబంధాలు ధ్వంసం అయిపోయి పశుప్రాయంగా మారుతున్నాయి. తాజాగా తనకు రూ.15 లక్షలు ఇస్తేనే శోభనానికి అంగీకరిస్తాను అంటూ ఓ ప్రబుద్దుడు మెుండికెస్తన్న వైనం వెలుగులోకి వచ్చింది.

అవినాశ్‌ వర్మ అనే ఇంజినీరు ఉద్యోగికి 2022 జూన్‌ 6న వివాహమైంది. పెళ్లి చేసుకున్న సమయంలో తనకు కట్నం, కానుకలు వద్దంటూ చెప్పి తర్వాత కట్నం కోసం అత్తింటి వారిని వేధించడం మెుదలుపెట్టాడు.

దీంతో తన భర్త కట్నం కోసం తన పుట్టింటి వారిని వేధిస్తున్నాడని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. భర్త ఒత్తిళ్లు తట్టుకోలేక తన పుట్టింటి వారు రూ.5.8 లక్షలు ఇచ్చారని.. మిగిలిన నగదు ఇస్తేనే మొదటి రాత్రి అంటూ వేధిస్తున్న డిని ఫిర్యాదులో పేర్కొంది. తనకు డబ్బులు ఇవ్వకపోతే ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటూ తనను మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెడుతున్నాడంటూ ఆమె ఆరోపించింది. అతని నుండే కాకుండా ఇంట్లో ఉన్న ఇతర కుటుంబ సభ్యులతోనూ తనకు ఇబ్బందులు వస్తున్నాయని ఆరోపించింది.

Updated : 7 Jan 2024 9:11 AM IST
Tags:    
Next Story
Share it
Top