Home > క్రైమ్ > కియా కారును అడ్డగించి రూ.4 కోట్ల దోపిడీ

కియా కారును అడ్డగించి రూ.4 కోట్ల దోపిడీ

కియా కారును అడ్డగించి రూ.4 కోట్ల దోపిడీ
X

నంద్యాల జిల్లా డోన్ జాతీయ రహదారిపై భారీ దోపిడి చోటు చేసుకుంది. కియా కారును అడ్డగించి రూ.4కోట్లు దుండుగులు దోచుకెళ్లారు. వెల్దుర్తి మండలం అమకతాడు టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన జరిగింది. కియాకారును ఆత్మకూరు సమీపంలో దుండగులు వదిలివెళ్లారు. రూ.4కోట్ల దారి దోపిడీపై బాధితులు, పోలీసులు నోరు మెదపకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితులు గుజరాత్ వాసులుగా తెలిసింది.

గత నెల 28వ తేదీన జరిగిన ఈ భారీ దోపిడి ఆలస్యంగా బయటక వచ్చింది. గుజరాత్ కు చెందిన వ్యక్తులు.. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు రూ.4 కోట్లతో కియా కారులో వెడుతుండగా.. ఆత్మకూరు సమీపంలో కారును ఆపి, కారులోని వ్యక్తులను దింపి, కారుతో సహా పరారయ్యారు. వెంటనే వీరు డోన్ పోలీసులకు మౌఖికంగా తెలిపారు. వారు రహస్యంగా విచారణ చేపట్టారు. బాధితులు గుజరాత్, భావ్ నగర్ కి చెందిన వారిగా సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Updated : 13 July 2023 3:22 PM IST
Tags:    
Next Story
Share it
Top