Home > క్రైమ్ > Korutla Deepti's Case : కోరుట్ల దీప్తి హత్య కేసులో వీడిన మిస్టరీ..

Korutla Deepti's Case : కోరుట్ల దీప్తి హత్య కేసులో వీడిన మిస్టరీ..

Korutla Deeptis Case : కోరుట్ల దీప్తి హత్య కేసులో వీడిన మిస్టరీ..
X

జగిత్యాల జిల్లా కోరుట్లలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దీప్తి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. దీప్తి చెల్లి చందన, ఆమె ప్రియుడే దీప్తిని అన్యాయంగా చంపేశారు. ఇప్పటికే పోలీసులు వారిద్దరితోపాటు.. వారికి సహకరించిన మరో ఇద్దరు (దగ్గరి బంధువు, కార్ డ్రైవర్)వ్యక్తులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలులో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. సరిగ్గా అక్క చనిపోయిన రోజే సోదరి కనిపించకపోవడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. అందులోనూ తెల్లవారుజామున బస్టాండులో ప్రియుడితో కనిపించడం సైతం అనుమానాలకు దారితీసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భీమునిదుబ్బలో బంక శ్రీనివాస్‌రెడ్డి, మాధవి దంపతులు నివాసముంటున్నారు. వీరికి దీప్తి, చందన, సాయి సంతానం. దీప్తి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిగా ఏడాదిన్నర క్రితం చేరారు. ప్రస్తుతం ఇంటి నుంచే పనిచేస్తుంది. కుమారుడు సాయి బెంగళూరులో ఉంటున్నాడు. చందన బీటెక్‌ పూర్తి చేసి, ఇంటి వద్దే ఉంటోంది. అయితే చందన గత కొద్దికాలంగా తన సీనియర్ తో ప్రేమాయణం నడుపుతోంది. అతడిది వేరే మతం కావడంతో తల్లిదండ్రులు, అక్క దీప్తి లు.. ఆమె ప్రేమ వ్యవహారానికి అభ్యంతరం తెలిపారు. పక్కా ప్లాన్ ప్రకారం తల్లిదండ్రులు లేని సమయంలో బాయ్ ఫ్రెండ్ తో కలసి తన సోదరిని మట్టుబెట్టింది చందన. ఆ తర్వాత బాయ్ ఫ్రెండ్ తో కలసి అక్కడి నుంచి పరారైంది. అయితే ఈ విషయాలేవీ వారి తల్లిదండ్రులకు తెలియవు.

బంధువుల ఇంట్లో గృహప్రవేశం ఉండటంతో ఆదివారం(ఆగస్టు 27) శ్రీనివాస్‌రెడ్డి, మాధవి హైదరాబాద్‌కు వెళ్లారు. సోమవారం(ఆగస్టు 28) రాత్రి 10 గంటలకు వారిద్దరూ కుమార్తెలతో ఫోన్‌లో మాట్లాడారు. మంగళవారం(ఆగస్టు 29) మధ్యాహ్నం ఫోన్‌ చేయగా దీప్తి ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు. చందన ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ వచ్చింది. వెంటనే ఇంటి ముందున్న వారికి శ్రీనివాస్ రెడ్డి సమాచారం ఇచ్చాడు. దీంతో వారొచ్చి చూడగా... దీప్తి మృతి చెంది ఉండడాన్ని గమనించారు. ఆ తర్వాత చందన ఆచూకీ కోసం పోలీసులు బస్టాండ్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించగా ఆమె, ఓ యువకుడు కలిసి ఉదయం 5.12 నుంచి 5.16 గంటల వరకు నిజామాబాద్‌ బస్సులు ఆగేచోట కూర్చుని, కొద్దిసేపటికి నిజామాబాద్‌ వెళ్లే బస్సులో ఎక్కినట్లు రికార్డు అయింది. తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీప్తి శరీరంపై గాయాలున్నట్టు పోస్టుమార్టం చేసిన వైద్యులు గుర్తించారు. ఇందుకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది


Updated : 2 Sept 2023 1:59 PM IST
Tags:    
Next Story
Share it
Top