Home > క్రైమ్ > ప్రేమించిన అమ్మాయితో ఎంగేజ్మెంట్.. కాదని మరో అమ్మాయితో పెళ్లి

ప్రేమించిన అమ్మాయితో ఎంగేజ్మెంట్.. కాదని మరో అమ్మాయితో పెళ్లి

ప్రేమించిన అమ్మాయితో ఎంగేజ్మెంట్.. కాదని మరో అమ్మాయితో పెళ్లి
X

ప్రేమ పేరుతో యువతి వెంట ఐదేళ్లపాటు తిరిగిన వ్యక్తి.. నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. పెళ్లి మూహూర్తం దగ్గర పడటంతో.. మరోకరిని పెళ్లి చేసుకుని, ఆ యువతి ముందు నిలబడ్డాడు. అంతే.. ఆ మోసాన్ని తట్టుకోలేని ఆ యువతి పాయిజన్ తాగి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలులోని పీవీ నరసింహారావు కాలనీకి చెందిన పద్మావతి (30) డిగ్రీ పూర్తయ్యాక.. స్థానికంగా ఉన్న వాహన షోరూంలో పదేళ్లూగా పనిచేస్తోంది. ఐదేళ్ల క్రితం అదే షోరూంలో చేరిన వినోద్ అలియాస్ ప్రవీణ్.. తనను ప్రేమిస్తున్నానంటూ వెంట తిరిగాడు. కొన్నాళ్లకు తమ ప్రేమ వ్యవహారం ఇంట్లో చెప్పి ఒప్పించారు. మార్చి 9న నిశ్చితార్థం జరిగింది. జూన్ 10 పెళ్లికి లగ్నపత్రిక రాశారు. పెళ్లి పనులు కూడా మొదలుపెట్టారు.

అంతలోనే వినోద్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని.. జూపాడుబంగ్లా పోలీస్ స్టేషన్ కు చేరాడు. తనకు పద్మావతితో బలవంతంగా నిశ్చితార్థం చేశారని.. పద్మావతి వయసులో తనకంటే నాలుగేళ్లు పెద్దదని కంప్లైంట్ చేశాడు. విషయం తెలుసుకున్న పద్మావతి కుటుంబం దిశ మహిళా పోలీస్ లను ఆశ్రయించింది. సోమవారం నాడు విచారణ జరగాల్సి ఉండగా.. అంతలోనే పద్మావతి పాయిజన్ తాగి చనిపోయింది.

తన చావుకు వినోద్ కారణమని, పెళ్లి చేసుకుంటానని నమ్మింది.. నిశ్చితార్థం అయ్యాక తననకు మోసం చేసి వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని సూసైడ్ నోట్ రాసింది. వినోద్ అతని కుటుంబం తన చావుకు కారణం అని నోట్ లో రాసింది. ఈ లేక మేరకు వినోద్, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Updated : 6 Jun 2023 4:46 PM IST
Tags:    
Next Story
Share it
Top