Home > క్రైమ్ > బీహార్‌లో పిడుగులు ప‌డి 18 మంది మృతి

బీహార్‌లో పిడుగులు ప‌డి 18 మంది మృతి

బీహార్‌లో పిడుగులు ప‌డి 18 మంది మృతి
X

బీహార్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలకు తోడుగా పిడుగులు పడుతుండడంతో ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో పిడుగులు పడి వివిధ ప్రాంతాల్లో 18మంది మరణించారు. రోహ‌తాస్ జిల్లాల్లో 5, అర్వాల్‌లో 4, శ‌ర‌న్‌లో 3, ఔరంగ‌బాద్‌లో 2, బంకా-వైశాలి జిల్లాల్లో ఒకరు మృతి చెందారు.

పిడుగుపాటుకు మృతిచెందిన వారి కుటుంబాలకు 4లక్షల పరిహారం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పిడుగులు ఎక్కువగా పడుతుండడంతో డిజాస్ట‌ర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ కీలక సూచనలు చేసింది. ముఖ్యంగా గ్రామాల్లో ఉంటున్న ప్ర‌జ‌లు వ‌ర్షం కురుస్తున్న‌ప్పుడు వ్య‌వ‌సాయ క్షేత్రం, పొలాల్లోకి వెళ్ల‌ొద్దని సూచించింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు, మట్టితో చేసిన తాత్కాలిక ఇళ్ల కింద నిలబడొద్దని సూచించింది.

పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు వర్షాలు పడుతున్నప్పుడు కిటికీలకు దూరంగా ఉండాలని తెలిపింది. ఫ్రిజ్‌లు, ఏసీలు వంటి విద్యుత్ పరికరాలను తాకొద్దని, బిల్డింగులపై వెళ్లొద్దని సూచించింది. జులై 15వరకు బీహార్ లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, అరారియా, కిషన్‌గంజ్, సుపాల్‌తో సహా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


Updated : 15 July 2023 10:33 AM GMT
Tags:    
Next Story
Share it
Top