Home > క్రైమ్ > పెళ్లికి ఒప్పుకోలేదని మరదలి గొంతు కోసిన మేనబావ.. ట్విస్ట్ ఏంటంటే..

పెళ్లికి ఒప్పుకోలేదని మరదలి గొంతు కోసిన మేనబావ.. ట్విస్ట్ ఏంటంటే..

పెళ్లికి ఒప్పుకోలేదని మరదలి గొంతు కోసిన మేనబావ.. ట్విస్ట్ ఏంటంటే..
X

తనతో పెళ్లికి నిరాకరించిందన్న యువతిపై కక్ష పెట్టుకున్న ప్రేమోన్మాది దారుణానికి తెగబడ్డాడు. కత్తితో యువతి గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన యువతి తప్పించుకుని పారి పోయి కుటుంబ సభ్యుల సహకారంతో అసుపత్రిలో చేరింది. ఈ సంఘటన ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

హబ్సిగూడ ప్రాంతానికి చెందిన లక్ష్మీనారాయణ(31)కు ఇది వరకే పెళ్లైంది. షార్ట్‌ ఫిలింలతో పాటు వీడియో ఎడిటింగ్‌ చేస్తుంటాడు. రామంతాపూర్‌లో నివాసముండే బందువుల అమ్మాయి(22)కి లక్ష్మీనారాయణ వరుసకు మేన బావ. లక్ష్మీనారాయణతో కలిసి యువతి సోషల్‌ మీడియాలో రీల్స్‌ కూడా చేసినట్లు సమాచారం. అదే చనువును ఆసరాగా చేసుకుని లక్ష్మీనారాయణ పెళ్లి ప్రపోజల్స్‌ తీసుకు వచ్చాడు. అతడికి పెళ్లి ఆయిన కారణంగా యువతి నిరాకరించింది. ఈ మధ్య కాలంలో యువతికి సినిమా ఫీల్డ్‌లో అవకాశం వచ్చింది. అప్పటి నుంచి లక్ష్మీనారాయణను పెద్దగా పట్టించుకోవడం లేదు.

దీంతో యువకుడు ఈ నెల 22న యువతిని తన కారులో ఎక్కించుకుని ఉప్పల్‌ భగాయత్‌కు తీసుకు వచ్చాడు. మళ్లీ పెళ్లి ప్రస్తావను తీసుకు వచ్చాడు. ఇద్దరి మద్య వాగ్వివాదం పెరిగింది. ముందుగానే పథకం వేసుకున్న లక్ష్మీ నారాయణ తన వెంట తెచ్చుకున్న కత్తితో కారులోనే యువతి గొంతుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. తీవ్ర గాయాలైన యువతి తప్పించుకుని బయటకు వచ్చి చున్నీని మెడకు చుట్టుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. గాయపడిన యువతిని చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. కుంటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అరెస్టు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు.

Updated : 25 July 2023 5:56 AM GMT
Tags:    
Next Story
Share it
Top