వ్యక్తిని ఢీకొట్టి చంపిన అంబులెన్స్.. షాకింగ్ వీడియో
X
మహారాష్ట్రలోని జున్నార్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. రోగులను, బాధితులు అత్యవసరంలో ఆదుకునే అంబులెన్స్ వాహనం.. ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకుంది. నివేదికల ప్రకారం, ఈ సంఘటన జూలై 1 న జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేయడంతో షాకింగ్ వివరాలు వెల్లడయ్యాయి. కదులుతున్న అంబులెన్స్ వెనుక ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు. రివర్స్ తీసుకుంటున్న ఆ వైహికల్.. వెనుకనున్న వ్యక్తిని గమనించకుండా ఢీకొట్టింది. దీంతో అతడు గట్టిగా అరుస్తూ కుప్పకూలాడు. ఆ తర్వాత మళ్లీ ఆ వాహనం ముందుకు పోనిచ్చి మరోసారి అతడిపైకి దూసుకెళ్లింది. సంఘటన జరిగిన వెంటనే, అక్కడే ఉన్న స్థానికులు, ఇతరులు.. బాధితుడికి సహాయం అందించడానికి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అంబులెన్స్ సిబ్బంది వెంటనే కిందకు దిగి.. బాధితుణ్ని అదే వాహనంలో తమ హాస్పిటల్ కు తీసుకెళ్లారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఘటన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి అంబులెన్స్ వెనుక నిలబడి ఉన్నాడు. అదే సమయంలో పార్కింగ్ ప్లేస్ నుండి బయలుదేరిన అంబులెన్స్ .. అనుకోకుండా" వ్యక్తిపైకి వెళ్లింది, ఫలితంగా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వైద్యసేవలు అందించినప్పటికీ చికిత్స పొందుతూ బాధితుడు మృతి చెందాడు. స్థానిక పోలీసులు సీసీటీవీ ఫుటేజీని కీలకమైన సాక్ష్యంగా తీసుకున్నారు. ఈ సంఘటనకు దారితీసిన పరిస్థితులకు గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు.
महाराष्ट्र के #junnar में दर्दनाक हादसा CCTV में कैद..जीवनदायनी कहे जानेवाली ambulance ने ही एक शक्स की ली जान..पार्किंग से निकल रही एम्बुलेंस ने पीछे खड़े एक शख्स को पहले टक्कर मारा..फिर दो बार पहिये से कुचला..हादसे में पीड़ित शख्स की हुई मौत..घटना 1 जुलाई की है@indiatvnews pic.twitter.com/LH7z1h3kXT
— Atul singh (@atuljmd123) July 9, 2023