Home > క్రైమ్ > నడిరోడ్డు మీద కూలిపోయిన మలేసియా విమానం

నడిరోడ్డు మీద కూలిపోయిన మలేసియా విమానం

నడిరోడ్డు మీద కూలిపోయిన మలేసియా విమానం
X

మలేసియాలోని సెంట్రల్ సెలంగర్ రాష్ట్రంలో నడిరోడ్డు మీద విమానం కూలిపోయింది. లంగ్ కావి ఐలాండ్ నుంచి 6గురు ప్రయాణికులు, ఇద్దరు పైలట్లతో ఓ చిన్న విమానం బయలుదేరింది. సుల్తాన్ అబ్దుల్ అజీజ్ షా ఎయిర్ పోర్ట్ వైపుకు వెళుతుండగా సడెన్ గా ఫ్లైట్ లో సమస్య తలెత్తింది. రెక్టిఫై చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. విమానం గాల్లో కొంతసేపు అటూ ఇటూ ఇష్టమొచ్చినట్టు తిరిగి కప్పకూలిపోయింది.

విమానం కూలిన రహదారి ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. విమానం పడినప్పుడు కూడా దాని మీద చాలా వాహనాలు ఉన్నాయి. ఫ్లైట్ పడుతున్నప్పుడు వాహనదారులు చూస్తూనే ఉన్నారు. కానీ ఏం జరుగుతుందో అని తెలిసేలోపునే విమానం రోడ్డు మీద పడిపోయింది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న ఎనిమిది మందితో పాటూ కింద కారులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి, ఒ్ బైక్ రైడర్ కూడా చనిపోయారు. మృతుల్లో సెంట్రల్ పహాంగ్ రాష్ట్రానికి చెందిన పొలిటికల్ లీడర్ జోహారీ హరున్ ఉన్నట్లు గుర్తించారు.

విమానం పడిన దృశ్యాలు ఒక కారులోని డాష్ బోర్డు మీద ఉన్నకెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ కారులో ఉన్నవారు దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయింది. విమానం పడగానే రోడ్డు మీద పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ చుట్టుపక్కల వ్యాపించింది. విమానం సరిగ్గా వెళ్ళడం లేదనే విషయాన్ని తాను గమనించానని చెబుతున్నారు మలేసియా మాజీ ఎయిర్ ఫోర్స్ సభ్యడు మహమ్మద్ శ్యామీ మషీమ్. ఆ తర్వాత పెద్ద శబ్దం వినిపించదని చెప్పారు. వెంటనే తాను అక్కడకు వెళ్ళి చూశానని...అక్కడ ఫ్లైట్ శకలాలు, ఓ మృతదేహం కాలుతూ కనిపించిందని చెప్పారు.


Updated : 17 Aug 2023 8:24 PM IST
Tags:    
Next Story
Share it
Top