Home > క్రైమ్ > పబ్జీతో అతనికి పరిచయం.. ఆపై స్నేహం.. ఫైనల్‌గా అత్యాచారం..

పబ్జీతో అతనికి పరిచయం.. ఆపై స్నేహం.. ఫైనల్‌గా అత్యాచారం..

పబ్జీతో అతనికి పరిచయం.. ఆపై స్నేహం.. ఫైనల్‌గా అత్యాచారం..
X

ఆన్‌లైన్ పరిచయాలు, ఆ స్నేహాలు.. ఎలాంటి దారుణాలకు దారి తీస్తున్నాయో తరచూ చూస్తూనే ఉన్నాం. తాజాగా పబ్జీ గేమ్ లో పరిచయమైన వ్యక్తికి బాగా కనెక్ట్ అయిన ఓ మహిళ.. చివరికి అతడి చేతిలో మోసపోయింది. ముఖం కనిపించకుండా ఆడే పబ్జీ గేమ్ కాస్త.. చివరకు ఆమె ప్రైవేట్ వీడియోలను ఊరంతా చూసేలా చేసింది.

ఇది జరిగిందీ..

మహారాష్ట్ర రాజధాని ముంబయికి చెందిన 33 ఏళ్ల మహిళకు పబ్జీ గేమ్ గేమ్ ఆడుతుండేది. అయితే ఆ గేమ్‌లో రెండున్నర సంవత్సరాల కిందట ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. వారి పరిచయం స్నేహంగా మారింది. తరువాత ఇద్దరూ అనుకొని ఒకే సంస్థలో జాబ్ లో జాయిన్ అయ్యారు. ఎలాగూ స్నేహముంది, ఓకే కంపెనీ కాబట్టి.. ఇద్దరి మధ్య కాస్త చనువు పెరిగింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. పలుమార్లు లైంగిక దాడికి ఒడిగట్టాడు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ఆ మహిళకు ఓ షాకింగ్ విషయం చెప్పాడు. ఆమెను పెళ్లి చేసుకోబోనని తేల్చి చెప్పాడు.

పెళ్లి మాత్రం చేసుకోనని కాని మళ్లీ తనతో మునపటిలాగే ఉండాలని కోరారు. దీనికి ఆమె నిరాకరించడంతో బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు. తనతో సన్నిహితంగా ఉండకపోతే గతంలో ఇద్దరం కలిసి ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. అతడి వేధింపులను కొంత కాలం భరించిన ఆమె.. వాటిని తట్టుకోలేకపోయింది. అనంతరం పోలీసులను ఆశ్రయించి, తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని.. దర్యాప్తు జరుపుతున్నారు.

Updated : 26 July 2023 9:03 AM IST
Tags:    
Next Story
Share it
Top