తల్లితో గొడవపడి.. స్నేహితుడి చేతిలో హత్య
X
కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం జరిగింది. నమ్మి వచ్చిన స్నేహితుడిని దారుణంగా హత్య చేసి ఇంట్లోనే పూడ్చి పెట్టాడు ఓ వ్యక్తి. స్థానిక ఈశ్వర్ రెడ్డి నగర్ లో ఈ ఘోరం జరిగింది. ఇంట్లో గొడవపడి స్నేహితుడి ఇంటికి వచ్చిన యువకుడు.. దారుణ హత్యకు గురయ్యాడు. తల్లితో ఇంట్లో గొడవపడిన సతీష్ అనే వ్యక్తి ఇంట్లో గొడవపడి స్నేహితుడైన కిషోర్ దగ్గరికి వచ్చాడు. ఏం జరిగిందో తెలియదు కానీ.. సతీష్ ను చంపి ఇంట్లోనే పూడ్చి పెట్టినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నెలరోజుల క్రితం ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది.
సతీష్‌ని చంపి ఇంట్లోనే ఇసుకలో పూడ్చిపెట్టాడు కిషోర్. నెల రోజులవుతున్నా కొడుకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కిషోర్ తల్లి సతీష్ ఇంటికి వచ్చింది. తన కొడుకు ఎక్కడ అని ప్రశ్నించగా కిషోర్ ఏమీ సమాధానం చెప్పలేదు. ఇంట్లోనుంచి దుర్వాసన వస్తుండడంతో కిషోర్ ను గట్టిగా నిలదీయగా.. తానే చంపినట్లు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు కిషోర్ ను అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.