Home > క్రైమ్ > టీ తాగుదామని పిలిచి.. ప్రియురాలిపై కత్తితో దాడి

టీ తాగుదామని పిలిచి.. ప్రియురాలిపై కత్తితో దాడి

టీ తాగుదామని పిలిచి.. ప్రియురాలిపై కత్తితో దాడి
X

హైదరాబాద్‌లోని నార్సింగి పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. టీ తాగుదామని పిలిచి ప్రియురాలిపై కత్తితో దాడి చేశాడో ఉన్మాది. గచ్చిబౌలి ప్రాంతానికి చెందిన గణేష్‌.. తన ప్రియురాలు వాసవికి కాల్ చేసి.. ఆమెతో మాట్లాడాలని నార్సింగి గ్రిల్ ట్రీ హోటల్ వద్దకు పిలిచాడు. దీంతో ఆమె హోటల్ వద్దకు వచ్చింది. ఏమైందో ఏమో కానీ ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది. దీంతో గణేష్ ఒక్కసారిగా తన బ్యాగ్‌లో నుంచి కత్తిని తీసి ఆమెను పొడిచి పారిపోయాడు. వాసవి మెడ, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బాధితురాలిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు వాసవి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ పిడుగురాళ్ల.

గత కొంత కాలంగా వాపవి, గణేశ్ లు ప్రేమించుకుంటున్నారని తెలిసింది. ప్రేమ వ్యవహారంలో ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో కూర్చుని మాట్లాడుకుందామని పిలిపించాడు గణేశ్. అతని మాటలు నిజమేనని నమ్మి గ్రిల్ ట్రీ హోటల్ దగ్గరికి రాగా.. ఆమెతో విచక్షణా రహితంగా ప్రవర్తించాడు. గొడవ పెట్టుకొని, ముందే తెచ్చుకున్న కత్తితో ఆమె మీద దాడి చేశాడు. దీంతో ఆమె మెడ, చేతులు లపై గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా.. హైదరాబాద్ లో నేరాలు ఎక్కువైపోతున్నాయి. హత్యలు, దాడులు చేసేవారికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. ప్రభుత్వం నేరాలు తగ్గించడానికి ప్రజల రక్షణ కోసం అనేక చర్యలు చేపట్టినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోతోంది. రోజులో ఎక్కడో హత్యలు.. అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. నిన్న ఒకే రాత్రి నలుగురు హత్యకు గురవ్వగా.. నేడు ఈ సంఘటనతో స్థానిక ప్రాంతాల్లో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు



stabbed girlfriend, injured , Narsingi , Maniac attacks

Updated : 21 Jun 2023 11:58 AM IST
Tags:    
Next Story
Share it
Top