Home > క్రైమ్ > బాంబుతో బెదిరించి.. బ్యాంకులో రూ.24 లక్షలు ఎత్తుకెళ్లాడు

బాంబుతో బెదిరించి.. బ్యాంకులో రూ.24 లక్షలు ఎత్తుకెళ్లాడు

బాంబుతో బెదిరించి.. బ్యాంకులో రూ.24 లక్షలు ఎత్తుకెళ్లాడు
X

అది ఓ ప్రైవేట్ బ్యాంక్. సిబ్బంది తమ పనుల్లో లీనమయ్యారు. ఆ సమయంలో ఖాతాదారులు ఎవరూ లేరు. ఇంతలో ఓ వ్యక్తి వచ్చాడు. తన దగ్గర బాంబు ఉందని.. పేలుస్తానంటూ బెదిరించాడు. దీంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటన రాజస్థాన్ హర్‌సావా ప్రాంతంలో జరిగింది.

రాజస్థాన్‌లోని హర్‌సావా ప్రాంతంలో ఓ ప్రైవేట్ బ్యాంకులో పట్టపగలే దోపిడి జరిగింది. మాస్కు ధరించిన ఓ దుండగుడు బ్యాంకులోకి ప్రవేశించాడు. నగదు ముట్టజెప్పాలని.. లేనిపక్షంలో తన వద్ద ఉన్న బాంబును పేల్చేస్తానని సిబ్బందిని బెదిరించాడు. దీంతో భయపడిపోయిన సిబ్బంది తొలుత రూ.1.25 లక్షలు ఇచ్చారు. అయితే.. నిందితుడు మరింత డబ్బు డిమాండ్ చేశాడు.

ఈ క్రమంలోనే క్యాషియర్ గదిలోకి వెళ్లిన దుండగుడు మొత్తం రూ.24 లక్షల వరకు ఎత్తుకెళ్లాడు. పోయేటప్పుడు బ్యాంకు ప్రధాన గేటుకు తాళం వేసి పారిపోయాడు. ఈ ఘటన సమయంలో బ్యాంకు లోపల కస్టమర్లు ఎవరూ లేరు. బ్యాంకు సిబ్బంది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విచారణ జరుపుతున్నారు.

Updated : 6 July 2023 10:53 PM IST
Tags:    
Next Story
Share it
Top