Home > క్రైమ్ > దొంగలందు ఈ దొంగలు వేరయా..బట్టల షాపుకు కన్నం వేసి.. బంగారం లూటీ

దొంగలందు ఈ దొంగలు వేరయా..బట్టల షాపుకు కన్నం వేసి.. బంగారం లూటీ

దొంగలందు ఈ దొంగలు వేరయా..బట్టల షాపుకు కన్నం వేసి.. బంగారం లూటీ
X

సాధారణంగా దొంగలు పక్కా ప్లాన్ వేసి టార్గెట్ ఫిక్స్ చేసుకుని దొంగతనాలు చేస్తుంటారు. ఏ షాపును లూటీ చేయాలనుకుంటారో అక్కడ రోజుల తరబడి పాగా వేసి మరి ఆ షాపుపై నిఘా వేస్తుంటారు. ఛాన్స్ దొరకగానే తమ చేతికి పని చెబుతుంటారు. ఎంత ప్లాన్ చేసినా పోలీసులకు ఈజీగా దొరికిపోతుంటారు. కానీ ఈ దొంగలు మాత్రం వేరే లెవెల్లో ఆలోచించారు. వీరి స్కెచ్ చూసి పోలీసులే ఖంగుతిన్నారు. సినిమా లెవెల్‎లో ప్లాన్ వేసి మరీ దొంగతనం చేశారు చోరులు.బట్టల షాపుకు కన్నం వేసి బంగారం షాపులోకి దూరి మరీ అతితెలివితో రూ.24 లక్షలకుపైగా విలువైన బంగారాన్ని లూటీ చేశారు.

హైదరాబాద్‎లోని శివారు ప్రాంతమైన చందానగర్‎లోని ఓ బంగారు షాపులో ఈ చోరీ జరిగింది. దొంగతనం జరిగిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బంగారం షాపు షట్టర్ కానీ, డోర్ కానీ పగులగొట్టకుండా పోలీసులే కన్‎ఫ్యూజ్ అయ్యేలా 40 తులాల బంగారాన్ని అపహరించారు దొంగలు. బంగారం షాపు పక్కనే ఉన్న బట్టల షాపుకు కన్నం వేసి దొంగలు ఈ దోపిడీ చేశారు. షాపులో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా దొంగతనం ఎలా జరిగిందో తెలుసుకుని షాపు యజమానులతో సహా పోలీసులు షాక్ అయ్యారు.


Updated : 1 Aug 2023 5:16 PM IST
Tags:    
Next Story
Share it
Top