దారుణం.. కూతుళ్లనే తార్చిన కన్నతల్లి
మగ సంతానం కోసం రెండో భర్తకు...ఛీ ఛీ
X
ఏపీలోని ఏలూరు జిల్లాలో జరిగిన దారుణ అకృత్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. మాతృత్వానికి మచ్చతెచ్చేలా ఓ కన్నతల్లి అత్యంత నీచంగా వ్యవహరించింది. వయసొచ్చిన తన కుమార్తెలను రెండో భర్తకు తార్చింది. ఏలూరు జిల్లా పెదపాడు మండలంలోని ఓ గ్రామంలో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కూతుళ్ల ఫిర్యాదుతో దిశ పోలీసులు.. ఆ తల్లిని, ఆమె రెండో భర్తను గురువారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళకు భర్త, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఇద్దరి సంతానం తర్వాత ఆమె పిల్లలు పుట్టకుండా చేయించుకుంది. అయితే 2007లో ఆమె భర్త అనారోగ్యంతో మృతి చెందగా... మేనత్త కొడుకును రెండోపెళ్లి చేసుకుంది. సదరు రెండో భర్త తనకు పిల్లలు కావాలని, లేదంటే మరో పెళ్లి చేసుకుంటానని బెదిరించేవాడు. కొన్నేళ్లకు.. ఆడపిల్లలిద్దరూ వయసుకు వచ్చాక.. వేరే పెళ్లి వద్దని, తన కుమార్తెలతోనే పిల్లల్ని కనాలని ఆమె ఒప్పించింది. దీంతో అతడు.. 17 ఏళ్ల పెద్ద కూతురితో కలిసి.. 2017లో ఆడ బిడ్డను కన్నాడు. మగ సంతానం కావాలని అడగ్గా.. ఆ తల్లి రెండో కూతురిని కూడా అతడికి బలి చేసింది. మగ పిల్లవాడి కోసం తన రెండో కుమార్తెనూ భర్తకు అప్పగించగా.. ఆమెకు ఏడాది క్రితం మగశిశువు పుట్టి చనిపోయాడు. ఆ మృతదేహాన్ని కాలువలో పడేశారు. ఇటీవల భర్తతో విభేదాలతో.. కూతుళ్లను గ్రామంలోనే వదిలేసి విశాఖలోని పుట్టింటికి వెళ్లిపోయింది. చిన్న కుమార్తె తనకు పరిచయమైన యువకుడికి ఈ స్టోరీ అంతా చెప్పడంతో.. అతడు ఈ ఆడపిల్లల మేనమామకు తెలిపాడు. బంధువులంతా ఏలూరు వచ్చి బాధితులతో దిశ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. దిశ సీఐ ఇంద్రకుమార్ ఆధ్వర్యంలో నిందితులపై పోక్సో కేసు నమోదు చేశారు.

Veerendra Prasad
వీరేందర్ మైక్ టీవీ వెబ్‌సైట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్(సబ్ ఎడిటర్)గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో(V6, T News) రాజకీయం, లైఫ్ స్టైల్, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.