ముసలోళ్లను చంపి.. ముప్పై ఏళ్లకు దొరికాడు
X
మందు తాగితే లోపల ఉన్న నిజాలన్నీ బయటకు వస్తాయంటారు. అలా ఓ వ్యక్తి మందు తాగి ఉన్న నిజాలను కక్కాడు. చివరకు కటకటాల్లోకి వెళ్లాడు. అది కూడా నేరం చేసిన 30 ఏళ్ల తర్వాత. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. అవినాష్ పవార్ అనే వ్యక్తి 1993 అక్టోబర్లో మహారాష్ట్రలోని లోనావాలాలో ఓ 55 ఏళ్ల వ్యక్తి ఇంటిని కొల్లగొట్టేందుకు ప్లాన్ వేశాడు. మరో ఇద్దరితో కలిసి ఇంట్లోకి చొరబడ్డాడు. ఈ క్రమంలో అడ్డువచ్చిన దంపతులను దారుణంగా చంపేశాడు. అవినాష్‌కి అప్పుడు 19 ఏళ్లు. మిగతా ఇద్దరిని పోలీసులు అప్పుడే అరెస్ట్ చేయగా.. అతడు మాత్రం తప్పించుకున్నాడు.
ఘటర తర్వాత అవినాష్ మొదట ఢిల్లీ వెళ్లాడు. అక్కడి నుంచి మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చేరుకున్నాడు. అక్కడ అమిత్ పవార్ అని పేరు మార్చుకుని డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు. ఆ తర్వాత అదే పేరుతో ఆధార్ కార్డుకు కూడా అప్లై చేసుకున్నాడు. అక్కడి నుంచి పలు ప్రాంతాలు మారి.. చివరకు ముంబై చేరుకుని సెటిల్ అయ్యాడు. అక్కడే ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుని.. రాజకీయాల్లోకి పంపించాడు.
ఇలా 30 ఏళ్లుగా నేరాన్ని దాచిపెడుతూ..హాయిగా జీవించాడు. అయితే ఇటీవల అవినాష్ తన ఫ్రెండ్స్‌తో కలిసి మద్యం సేవించాడు. తాగిన మత్తులో తను 19 ఏళ్ల వయసులో చేసిన మర్డర్ గురించి ఫ్రెండ్స్‌కి చెప్పేశాడు. ఈ విషయం కాస్త ముంబయి క్రైం బ్రాంచ్ సీనియర్ ఆఫీసర్, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ చెవిన పడింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి.. జైలుకు తరలించారు.
mumbai drunken man reveals 30 years ago case story
mumbai,drunken man,30 years,maharashtra,Lonavala,delhi,mumbai police