Home > క్రైమ్ > ముంబైలో దారుణం.. దానికి నో చెప్పిందని గర్ల్ఫ్రెండ్పై దాడి

ముంబైలో దారుణం.. దానికి నో చెప్పిందని గర్ల్ఫ్రెండ్పై దాడి

ముంబైలో దారుణం.. దానికి నో చెప్పిందని గర్ల్ఫ్రెండ్పై దాడి
X

ప్రేమ కొందరికి శాపంగా మారుతుంది. ప్రేమించిన వ్యక్తికి నచ్చినట్లు చేయకపోవడం వారి ప్రాణాల మీదికి తెస్తుంది. ఈ క్రమంలో కొందరు యువకులు కిరాతకులుగా మారి దాడులకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ముంబైలో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. తాను చెప్పింది చేయలేదన్న కోపంతో గర్లఫ్రెండ్పై ఓ బాయ్ ఫ్రెండ్ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో యువతి తీవ్రంగా గాయపడగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.

ముంబయి శివారులోని కల్యాణ్‌ ప్రాంతానికి చెందిన ఆకాష్ ముఖర్జీ అనే యువకుడు తన కంపెనీలోనే పనిచేస్తున్న ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు. గత కొన్నేళ్లుగా వీళ్లు రిలేషన్షిప్లో ఉన్నారు. ఈ క్రమంలో బుధవారం వీరిద్దరూ గేట్‌ వే ఆఫ్‌ ఇండియా వంటి ప్రదేశాలకు వెళ్లి.. సాయంత్రం బాంద్రా బాండ్‌స్టాండ్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత తన లైంగిక వాంఛను తీర్చాలంటూ బహిరంగ ప్రదేశంలోనే బాయ్ ఫ్రెండ్ డిమాండ్‌ చేయగా.. అందుకు గర్ల్‌ఫ్రెండ్‌ ససేమిరా అన్నది.

యువతి ఒప్పుకోకపోవడంతో అతడిలోని మృగం బయటకొచ్చింది. యువతి గొంతు నులిమి చంపేందుకు యత్నించాడు. అంతటితో ఆగకుండా ఆమె తలను బండరాయికేసీ కొట్టి.. కాల్వలో పడేసేందుకు ప్రయత్నించాడు. యువతి కేకలు వేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసలు నిందితుడుని అదుపులోకి తీసుకొని.. యువతిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Updated : 2 Jun 2023 7:00 PM IST
Tags:    
Next Story
Share it
Top