Home > క్రైమ్ > ఢిల్లీలో దారుణం.. దొంగ అంటూ ముస్లిం వ్యక్తిని స్తంభానికి కట్టేసి..

ఢిల్లీలో దారుణం.. దొంగ అంటూ ముస్లిం వ్యక్తిని స్తంభానికి కట్టేసి..

ఢిల్లీలో దారుణం.. దొంగ అంటూ ముస్లిం వ్యక్తిని స్తంభానికి కట్టేసి..
X

ఢిల్లీలో దారుణం జరిగింది. సుందర్ నగరిలో ముస్లిం వ్యక్తిని పలువురు వ్యక్తులు కొట్టి చంపారు. మహ్మద్ ఇసార్ అనే దివ్యాంగుడిని కొందరు వ్యక్తులు దొంగతనం చేశాడనే అనుమానంతో స్తంభానికి క‌ట్టేసి కొట్టారు. తీవ్ర గాయాలైన ఇసార్ను అమీర్ అనే వ్యక్తి ఇంటికి చేర్చాడు. G4 బ్లాక్ సమీపంలో పలువురు యువకులు దొంతనం చేశానని పట్టుకుని కట్టేసి కొట్టారని ఇసార్ తండ్రికి వివరించాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే అతడు ప్రాణాలు వదిలాడు.

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోలో ఇసార్ను ప‌లువురు వ్య‌క్తులు క‌ర్ర‌ల‌తో కొడుతున్నట్లు ఉంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని సీసీ టీవీ పుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా కొన్ని రోజుల క్రితం ఇదే ప్రాంతంలో ఓ హిందూ బాలుడి హత్య జరిగింది.


Updated : 27 Sept 2023 4:12 PM IST
Tags:    
Next Story
Share it
Top