Home > క్రైమ్ > ప్రవళిక కేసులో నిందితుడు శివరాంకు బెయిల్

ప్రవళిక కేసులో నిందితుడు శివరాంకు బెయిల్

ప్రవళిక కేసులో నిందితుడు శివరాంకు బెయిల్
X

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రవళిక ఆత్మహత్య కేసు మరో మలుపు తిరిగింది. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు శివరాం రాథోడ్ కు నాంపల్లి కోర్టు బెయిల్ ఇచ్చింది. ఆధారాలు లేవన్న కారణంతో న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. శుక్రవారం సరెండర్ అయ్యేందుకు కోర్టుకు వచ్చిన శివరాంను పోలీసులు న్యాయస్థానం ఆవరణలోనే అరెస్ట్ చేశారు.

ఈ రోజు మధ్యాహ్నం శివరాంను పోలీసులు వైద్య పరీక్షల కోసం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కేసు విచారణ జరిపిన న్యాయస్థానం నిందితుడిపై మోపిన అభియోగాలకు సంబంధించి సరైన ఆధారాలు లేవని ప్రకటించింది. రూ. 5వేల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది.

ఇదిలా ఉంటే ప్రవళిక ఆత్మహత్య కేసులో శివరాం రాథోడ్ ను ఇరికించారని అతని కుటుంబసభ్యులు అంటున్నారు. కేసుతో సంబంధం లేకున్నా అతన్ని అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



telangana,pravalika case,shivaram rathod,nampally court,bail granted,bail to shivram,proofs,gandhi hospital,police,shivaram family,pravalika case accused

Updated : 21 Oct 2023 12:17 PM GMT
Tags:    
Next Story
Share it
Top