హైదరాబాద్ బాంబ్ బ్లాస్ట్.. ఆ నలుగురు ఉగ్రవాదులకు జైలు శిక్ష
X
దేశంలో జరిగిన బాంబు పేలుళ్ల గురించి అందరికీ తెలిసిందే. ఎందరో అమాయక ప్రజలకు బలిగొన్నారు ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ. హైదరాబాద్ గోకుల్ చాట్, లుంబినీ పార్క్ పేలుళ్లతో పాటు.. దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్లు నిర్వహించారు. ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లో రెక్కీ నిర్వహించి హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. ఒబేద్ రెహ్మాన్, ఇమ్రాన్ ఖాన్, ధనీష్ అన్సారీ, ఆఫ్తాబ్ ఆలం ఐఎం సంస్థ ఉగ్రవాదులకు ఎన్ఐఏ (NIA) కోర్ట్ తీర్పునిచ్చింది. ఇండియన్ ముజాహిదీన్ తో కలిసి దేశంలో పేలుళ్లకు కుట్ర పన్నిన క్రమంలో వీరికి శిక్ష పడింది.
శుక్రవారం (జులై 13) జరిగిన కోర్ట్ సెషన్ లో ఈ ఉగ్రవాదులకు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. హైదరాబాద్, ఢిల్లీ పేలుళ్లతో పాటు.. వారణాసి, ముంబై, ఫజయాబాద్, బెంగళూరు పేలుళ్లలోనూ ఈ నిందితుల పాత్ర ఉందని ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. జులై 7న జరిగిన విచారణలో తమ నేరాలను అంగీకరించిన ఉగ్రవాదులకు.. స్పెషల్ జడ్జి శైలేందర్ మాలిక్ పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. కోర్టు తీర్పుపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. అంతమంది ప్రాణాలు తీసిని వీరికి ఇంత చిన్న శిక్ష విధించడం ఏంటని మండిపడుతున్నారు.