11 ఏండ్ల చిన్నారిపై అఘాయిత్యం.. మధ్యప్రదేశ్లో నిర్భయ తరహా ఘటన..
X
మధ్యప్రదేశ్‌లో నిర్భయ తరహా ఘటన వెలుగుచూసింది. అభం శుభం తెలియని చిన్నారిపై ఇద్దరు కామాంధులు అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా పాపను చిత్ర హింసలు పెట్టారు. ప్రైవేట్ పార్టుల్లో కర్రను జొప్పించారు. శరీరమంతా పళ్ల గాట్లతో ప్రాణాపాయస్థితిలో ఉన్న బాలిక ప్రస్తుతం హాస్పిటల్లో మృత్యువుతో పోరాడుతోంది.
నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి
సత్నా జిల్లాలోని ప్రముఖ ఆలయ ట్రస్టులో పని చేస్తున్న ఇద్దరు వ్యక్తులు 11 ఏళ్ల బాలికపై దారుణానికి పాల్పడ్డారు. గురువారం మధ్యాహ్నం సమయంలో చిన్నారిని మభ్యపెట్టి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై అత్యాచారం చేసి రాక్షసుల్లా వ్యవహరించారు. బాలిక శరీరమంతా పంటి గాయాలు చేశారు. ఆమె ప్రైవేటు భాగాల్లో కర్రను జొప్పించి ఉన్మాదాన్ని ప్రదర్శించారు. అనంతరం బాలికను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.
అపస్మారక స్థితిలో చిన్నారి
సాయంత్రమైనా కూతురు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు స్థానికులతో కలిసి పరిసర ప్రాంతాల్లో వెతికారు. ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పేరెంట్స్ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు గాలింపు చేపట్టగా.. బాధితురాలి ఇంటికి కిలోమీటర్ దూరంలోని అడవి ప్రాంతంలో అమ్మాయి కనిపించింది. ఆమె కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చిన పోలీస్ వెంటనే చిన్నారిని హాస్పిటల్ కు తరలించారు. విషయం తెలియడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు. పరిస్థితి చేయిదాటే అవకాశం ఉండటంతో అధికారులు భారీగా పోలీసులను మోహరించారు.
ఇద్దరి అరెస్ట్
నిందితుల కోసం గాలింపు చేపట్టిన పోలీసులు దారుణానికి పాల్పడిన ఇద్దరిని శుక్రవారం అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపరచడగా న్యాయమూర్తి 14 రోజుల జ్యూడీషియల్ విచారణకు ఆదేశించారు. మరోవైపు బాలిక పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు ప్రకటించారు. బాలిక ఒంటినిండా పంటి గాట్లు, గాయాలు ఉన్నాయని చెప్పారు. గోశాలలో పనిచేసే నిందితులను ట్రస్టు అధికారులు విధుల నుంచి తొలగించారు.
కఠిన శిక్ష
అమానుష ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. బాలిక పరిస్థితి తెలిసి బాధ కలిగిందని, నిందితులను కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసులను ఆదేశించినట్లు చెప్పారు. చిన్నారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
రక్షణ కరువు
చిన్నారిపై అత్యాచార ఘటనపై స్పందించిన మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్ కమల్ నాథ్ రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. ఆ బాలికకను మెరుగైన వైద్య సాయం అందించడంతో పాటు బాధిత కుటుంబానికి కోటి రూపాయల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ దారుణమైన అఘాయిత్యం నిర్భయ సంఘటనను గుర్తుచేస్తుందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందుతులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
मैहर में बेटी के साथ दुष्कर्म की जानकारी मिली है, मन पीड़ा से भरा हुआ है, व्यथित हूं।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) July 28, 2023
मैंने पुलिस को निर्देश दिए हैं कि कोई भी अपराधी बचना नहीं चाहिए
पुलिस ने अपराधियों को गिरफ्तार कर लिया है ।
प्रशासन को निर्देश दिए हैं कि बेटी के समुचित इलाज की व्यवस्था की जाए ।
कोई भी…