ఎలుకను చంపిన వ్యక్తి అరెస్ట్.. తిట్టిపోస్తున్న నెటిజన్లు
X
మూగజీవి ఎలుకను కనికరం లేకుండా బైక్ కింద నలిపి చంపిన వ్యక్తిని యూపీలోని నోయిడా పోలీసులు అరెస్ట్ చేశారు. మమురా గ్రామంలోని జైనుల్ అనే బిర్యానీ షాప్ ఓనర్.. తన షాప్ సమీపంలో తిరుగాడుతున్న ఓ ఎలుకను తన బైక్ తో నలిపి చంపాడు. దాన్ని బైక్ ను వెనకాముందుకు నడుపుతూ ఆ ఎలుకను నలిపి, నలిపి చంపేశాడు. దీన్నంతా... పక్కనే ఉన్న బిల్డింగ్ లోనుంచి ఎవరో వీడియో తీశారు. దాన్ని సోమవారం సోషల్ మీడియాలో పెట్టగా వైరల్‌గా మారింది. దీనిమీద నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మూగజీవంపై ఇంత కర్కశత్వమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరికొందరైతే ఆ ఎలుక మరణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఆ బిర్యానీ షాప్ పై దాడి చేశారు. అక్కడ పనిచేస్తున్న ఒక ఉద్యోగిపై దాడి చేశారు. వీడియోను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అతనెవరో గుర్తించిన పోలీసులు... వెంటనే ఖాన్ బిర్యానీ షాప్ కి చేరుకున్నారు. పోలీసులు తనకోసమే వస్తున్నారని గ్రహించి ముందే జైనుల్ పారిపోయాడు, అయితే పోలీసులు అతన్ని పట్టుకుని అరెస్ట్ చేశారు. పోలీసులు దీని మీద వివరణ ఇస్తూ... సిఆర్‌పిసి (క్రిమినల్ ప్రొసీజర్ కోడ్) సెక్షన్ 151 కింద వేరేకేసులో ఆ వ్యక్తిని అరెస్టు చేసినట్లు స్పష్టం చేశారు. అతని అరెస్ట్ కు కారణం ఎలుక మరణం మాత్రం కాదని చెప్పారు.
नोएडा में चूहे का मर्डर
— Privesh Pandey (@priveshpandey) July 24, 2023
बिरयानी वाले ने बाइक से कुचला
पुलिस ने किया गिरफ्तार
वीडियो सोशल मीडिया पर वायरल@noidapolice pic.twitter.com/U2W5RQ3KNE