Home > క్రైమ్ > మణిపూర్లో ఆగని దారుణాలు.. తల నరికి కంచెకు వేలాడదీత

మణిపూర్లో ఆగని దారుణాలు.. తల నరికి కంచెకు వేలాడదీత

మణిపూర్లో ఆగని దారుణాలు.. తల నరికి కంచెకు వేలాడదీత
X

మణిపూర్లో దారుణాలు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్న మహిళలపై పైశాచిక ఘటన మరవకముందే మరో భయంకర ఘటన వెలుగులోకి వచ్చింది. దుండగులు కుకీ తెగకు చెందిన ఓ వ్యక్తిని కిరాతకంగా చంపారు. అతడి తలను నరికి ఇంటి ముందు ఉన్న కంచెకు వేలాడిదీశారు. సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఈ వీడియో అందరినీ షాక్కు గురిచేసింది.

బిష్ణుపుర్‌ జిల్లాలోని ఓ నివాసిత ప్రాంతంలో ఈ నెల 2న ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. ఆ రోజు రాత్రి 12 గంటల సమయంలో జరిగిన ఘర్షణలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ తల వారిలో ఒకరిగా తెలుస్తోంది. ఇంతకుముందు ఇద్దరు కుకీ మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపింది. ఆ మంటలు చల్లారక ముందే మరో దారుణం వెలుగులోకి రావడం కలకలరం రేగుతోంది.

కుకీలు, మెయిటీల జాతుల మధ్య ఘర్షణతో గత కొన్ని నెలలుగా మణిపూర్ అట్టుడికిపోతోంది. మణిపూర్‌ లోని మెయిటీలకు ఎస్టీ హోదాను నాగా, కుకీ సామాజిక వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇరువర్గాలకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అయితే కొన్ని దారుణాలు వెలుగులోకి రావడం అందరినీ కలిచి వేస్తున్నాయి.

Updated : 22 July 2023 8:47 AM IST
Tags:    
Next Story
Share it
Top