షాకింగ్.. పాక్ వర్సిటీ విద్యార్థినిలపై లైంగిక వేధింపులు.. 5వేల వీడియోలు సీజ్
X
పాకిస్తాన్ లోని బహవల్పుర్ ఇస్లామియా యూనివర్సిటీలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. యూనివర్సిటీ విద్యార్థినిలు మాదక ద్రవ్యాలు తీసుకోవడం, లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. వాటికి సంబంధించిన 5,500 వీడియోలు తాజాగా లీక్ అయ్యాయి. దీన్ని వర్సిటీలో జరిగిన పెద్ద కుంభకోణం పరిగణిస్తున్నారు. వీటిని వర్సిటీ సిబ్బంది నుంచి స్వాధీనం చేసుకున్నారు. విద్యా బుద్దులు నేర్పాల్సిన వర్సిటీనే లైంగిక వేధింపుల బాగోతం వెలుగు లోకి రావడం పాకిస్తాన్ దేశంలో సంచలనంగా మారింది. విద్యార్థినులను డ్రగ్స్కు బానిసలుగా చేసి.. వీడియోలు తీసినట్లు తేల్చారు. వర్సిటీ సిబ్బంది వద్ద ఉన్న వీడియోలను పోలీసులు సీజ్ చేశారు.
ఈ కుంభకోణం వెనుక పాక్ కేంద్రమంత్రి చౌదరీ తారిక్ బషీర్ చీమా కొడుకు, ఆర్మీ మేజర ఇజాజ్ షాల హస్తం ఉన్నట్లు గుర్తించారు. దీంతో పాక్ విద్యా సంస్థలన్నింటిలో చీకటి మబ్బులు కమ్ముకున్నాయి. ఈ ఇద్దరినీ అరెస్ట్ చేసి విచారించగా.. లైంగిక మాత్రలు, మాదక ద్రవ్యాలు, అభ్యంతరకరమైన వీడియోలు దొరికాయి. అంతేకాకుండా విద్యార్థినులపై చేసిన అత్యాచార ఘటన కూడా వీళ్లు చిత్రీకరించారు. దీంతో వర్సిటీలో జరిగిన చీకటి బాగోతంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరపాలని పాక్ న్యాయస్థానం ఐదుగురు పోలీసులను నియమించింది.