దారుణం.. ప్రేమించడంలేదని యువతిపై దాడి
X
హైదరాబాద్లో దారుణం జరిగింది. ప్రేమించడం లేదన్న కారణంతో ఓ యువకుడు యువతిపై కత్తితో దాడి చేశాడు. కూకట్ పల్లిలోని విజయ నగర్ కాలనీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. యువతిపై దాడి అనంతరం నిందితుడు సైతం ఆత్మహత్యాయత్నం చేశాడు.
విజయ్ నగర్ కాలనీకి చెందిన ఓ యువతి స్థానికంగా ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తోంది. అదే ప్రాంతానికి చెందిన రాజు అనే యువకుడు కొన్ని రోజులుగా ప్రేమ పేరుతో యువతి వెంటపడుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం యువతిని అడ్డగించిన రాజు ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమెకు మెడపై తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం నిందితుడు సైతం ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికులు వెంటనే వారిద్దరినీ దగ్గరలోని హాస్పిటల్కు తరలించారు.
దాడికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసుుల ఘటనాస్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.