Home > క్రైమ్ > ఘోరం..అందరు చూస్తుండగానే బాలుడిని నేలకేసి కొట్టి చంపేశాడు...వీడియో వైరల్

ఘోరం..అందరు చూస్తుండగానే బాలుడిని నేలకేసి కొట్టి చంపేశాడు...వీడియో వైరల్

ఘోరం..అందరు చూస్తుండగానే బాలుడిని నేలకేసి కొట్టి చంపేశాడు...వీడియో వైరల్
X

కొందరు వ్యక్తులు ఒక్కోసారి మృగాలుగా మారిపోతారు. మనిషి అన్న సంగతి మరిచిపోయి జంతువుల్లా ప్రవర్తిస్తారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ సంఘటన చూస్తే వీడేం మనిషి రా అని అనక మానరు. యూపీలో తీర్థయాత్రకుు వచ్చిన ఓ యాత్రికుడు రెచ్చిపోయాడు. సైకోలా మారి దారినిపోయేవారిపై దాడులకు దిగాడు. ఓ పిల్లాడిని నేలకేసి కొట్టి చంపేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మధ్యప్రదేశ్‌లోని భిండ్‌ జిల్లాకు చెందిన ఓం ప్రకాష్ అనే యాత్రికుడు సప్తకోసి యాత్ర నిమిత్తం యూపీ వచ్చాడు. అతడు ఉన్నట్టుండి వింతగా ప్రవర్తించాడు. పట్టపగలే రోడ్డుపైకి షర్ట్ లేకుండా వచ్చి కనిపించిన వారిని పట్టుకొని కొట్టడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే అతడికి ఓ పిల్లోడు కనపడగా వెంటనే పరిగెత్తుకు వెళ్లి ఆ 5 ఏళ్ల బాలుడిని తలపైకి ఎత్తుకున్నాడు. అనంతరం పలుమార్లు నేలకు బాదేసి కొట్టాడు. చుట్టుపక్కలు అందరూ చూస్తుండగానే ఈ పని చేశాడు. ఈ ఘటనలో ఆ పిల్లోడు ప్రాణాలు అక్కడికక్కడే పోయాయి. స్థానికులు అతడిని పట్టుకొని దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే బాలుడిని ఎందుకు చంపాడన్న విషయాలు తెలియరాలేదు. ప్రస్తుతం వైరల్ అవతున్న ఆ దృశ్యాలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.


Updated : 20 Aug 2023 5:43 PM IST
Tags:    
Next Story
Share it
Top