Home > క్రైమ్ > పదేండ్ల పాపపై దాష్టీకం.. మహిళా పైలెట్ను పొట్టు పొట్టు కొట్టిన జనం..

పదేండ్ల పాపపై దాష్టీకం.. మహిళా పైలెట్ను పొట్టు పొట్టు కొట్టిన జనం..

పదేండ్ల పాపపై దాష్టీకం.. మహిళా పైలెట్ను పొట్టు పొట్టు కొట్టిన జనం..
X

భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులు. మంచి హోదాలో ఉన్నారు. ఇంట్లో పని చేసేందుకు ఓ మనిషి కోసం వెతికారు. ఓ పదేళ్ల బాలికను పనిలో కుదుర్చుకున్నారు. చిన్న పిల్ల అని కూడా చూడకుండా గొడ్డు చాకిరీ చేయించుకున్నారు. అంతటితో ఆగకుండా ఆ చిన్నారి పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. చిత్రహింసలకు గురి చేశారు. విషయం తెలియడంతో బాలిక బంధువులు భార్యాభర్తలిద్దరినీ రోడ్డుపైకి లాగారు. స్థానికులతో కలిసి చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

ఢిల్లీ ద్వారక ప్రాంతానికి చెందిన మహిళ ఓ ఎయిర్ లైన్స్ లో పైలట్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె భర్త కూడా ఎయిర్‌లైన్స్‌ ఉద్యోగే. వీరు రెండు నెలల కిందట ఓ 10 ఏళ్ల బాలికను ఇంట్లో పనికి కుదుర్చుకున్నారు. అప్పటి నుంచి ఆ చిన్నారితో గొడ్డుచాకిరీ చేయించుకుంటూ దారుణంగా వ్యవహరిస్తున్నారు. కొన్నిసార్లు చెప్పిన పని చేయలేదని ఇష్టమొచ్చినట్లు కొట్టారు. బుధవారం ఉదయం పాపను చూసేందుకు ఆమె బంధువు ఒకరు పైలెట్ ఇంటికి వచ్చారు. చిన్నారి శరీరంపై గాయాలు చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. విషయం కాస్తా మిగతా బంధువులు, స్థానికులకు తెలియడంతో ఆ దంపతులను నిలదీశారు. రోడ్డుపైకి లాక్కొచ్చి చితక్కొట్టారు.

కొంరు మహిళలు యూనిఫాంలో ఉన్న మహిళా పైలట్‌ జుట్ట పట్టుకొని మరీ కొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దాడిని అడ్డుకునేందుకు వ్చచిన ఆమె భర్తను సైతం బట్టలు ఊడదీసి మరీ కొట్టారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. మైనర్‌ను పనిలో పెట్టుకున్నందుకు గానూ కేసు నమోదు చేసి మహిళా పైలట్‌, ఆమె భర్తను అరెస్టు చేశారు.



Updated : 19 July 2023 6:06 PM IST
Tags:    
Next Story
Share it
Top