Home > క్రైమ్ > వాట్సాప్ గ్రూపుల్లో చైల్డ్ పోర్న్ వీడియోలు.. ఎంసీఏ స్టూడెంట్ అరెస్ట్

వాట్సాప్ గ్రూపుల్లో చైల్డ్ పోర్న్ వీడియోలు.. ఎంసీఏ స్టూడెంట్ అరెస్ట్

వాట్సాప్ గ్రూపుల్లో చైల్డ్ పోర్న్ వీడియోలు.. ఎంసీఏ స్టూడెంట్ అరెస్ట్
X

వాట్సాప్ గ్రూపుల్లో చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలను అప్‌లోడ్ చేస్తున్న ఎంసీఏ స్టూడెంట్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని అంబర్‌పేటకు చెందిన ఆ యువకుడు కొంతకాలంగా చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన వీడియోలను వేర్వేరు వెబ్ సైట్లలోకి, వాట్సాప్ గ్రూపుల్లోకి అప్‌లోడ్ చేస్తున్నాడు. దీనిని గుర్తించిన అమెరికన్ దర్యాప్తు ఏజెన్సీ హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ సిబ్బందికి వివరాలు అందజేసింది. వాళ్లు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వీడియోలు అప్‌లోడ్ చేస్తున్న యువకున్ని అరెస్ట్ చేసారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లికి చెందిన యువకుడు (24) హైదరాబాద్ లోని రామంతాపూర్‌లో నివాసముంటుున్నాడు. ఎంసీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్న అతడు.. గత రెండేళ్ల నుంచి 5 వాట్సప్‌ గ్రూపుల ద్వారా వస్తున్న చైల్డ్‌ పోర్నోగ్రఫీ వీడియోలను డౌన్‌లోడ్‌ చేసి చూస్తున్నాడు. వాటిని ఇతర గ్రూపుల్లో, వెబ్ సైట్లలో అప్‌లోడ్ చేస్తున్నాడు. ఈ వ్యవహారాన్ని అమెరికాలోని హోమ్‌లాండ్‌ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్‌ గుర్తించింది. వీడియోలు ఫార్వర్డ్‌ చేస్తున్న నంబరును గుర్తించి.. భారత్‌లోని సంబంధిత దర్యాప్తు సంస్థలకు సమాచారం ఇవ్వాలని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయానికి లేఖ రాసింది.

రాయబార కార్యాలయం ఈ విషయాన్ని సీబీఐకి తెలియజేసింది. సీబీఐ.. తెలంగాణ సీఐడీకి సమాచారం చేరవేసింది. ఈ ఫోన్‌ నంబరు ఆధారంగా ఇన్‌స్పెక్టర్‌ బృందంతో దర్యాప్తు చేయించిన సీఐడీ నిందితుడు రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో ఉంటున్నట్లు నిర్ధారించుకుంది. తదుపరి చర్యలు తీసుకోవాలంటూ రాచకొండ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌కు అందించింది. దీంతో సైబర్‌క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated : 12 July 2023 11:50 AM IST
Tags:    
Next Story
Share it
Top