Home > క్రైమ్ > ప్రేమ నిరాకరించిందని నడిరోడ్డుపై వెంబడించి..

ప్రేమ నిరాకరించిందని నడిరోడ్డుపై వెంబడించి..

ప్రేమ నిరాకరించిందని నడిరోడ్డుపై వెంబడించి..
X

వాళ్లిద్దరూ స్నేహితులు. మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్కు ప్రిపేరవుతున్నారు. ప్రతి రోజు కలిసి క్లాసులకు వెళ్లేవారు. ఓ రోజు అబ్బాయి ప్రేమిస్తున్నానని చెప్పడంతో ఆ ఆలోచన లేని అమ్మాయి అప్పటి నుంచి అతన్ని దూరం పెట్టింది. దీంతో కక్ష పెంచుకున్న యువకుడు ఆ అమ్మాయిపై దాడికి తెగబడ్డాడు. స్థానికులు సకాలంలో స్పందించడంతో సదరు యువతి ప్రాణాలతో బయటపడింది.

మంగళవారం పుణెలోని సదాశివ్‌ పేట్‌ ప్రాంతంలో స్కూటీపై వెళ్తున్న యువతిని నిందితుడు అడ్డగించాడు. 5 నిమిషాలు మాట్లాడాలని అడిగాడు. అయితే అందుకు ఆ అమ్మాయి అంగీకరించకపోవడంతో వెంట తెచ్చుకున్న కొడవలి బయటకు తీశాడు. బండి నడుపుతున్న యువకుడిపై దాడికి ప్రయత్నించాడు. అతడు తప్పించుకోవడంతో నిందితుడు బాధితురాలిపై దాడికి ప్రయత్నించాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు నిందితుడిని వెంబడించారు. అతనిపై రాళ్లు విసిరారు. ఎట్టకేలకూ పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు.

నిందితుడి దాడిలో యువతి చేతితో పాటు తలపై తీవ్ర గాయాలయ్యాయి. ప్రేమించమని వేధిస్తుండటంతో ఆ విషయాన్ని అతని కుటుంబసభ్యులకు ఫిర్యాదు చేయడంతో కక్ష పెంచుకుని దాడికి పాల్పడినట్లు బాధితులు చెబుతోంది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated : 27 Jun 2023 9:57 PM IST
Tags:    
Next Story
Share it
Top