రాజస్థాన్లో దారుణం.. చిన్నారిపై ఎస్సై అత్యాచారం..
X
ప్రజల్ని కాపాడాల్సిన రక్షకుడే ఓ బాలిక పట్ల రాక్షసుడిగా మారాడు. పోలీసు అధికారినన్న బాధ్యత మరిచి చిన్నారిపై ఆకృత్యానికి పాల్పడ్డాడు. రాజస్థాన్లోని దౌసా జిల్లాలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. చిన్నారికి న్యాయం చేయాలంటూ స్థానికులు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు.
దౌసా జిల్లాకు చెందిన భూపేంద్ర సింగ్ రహువాస్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఎన్నికల విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం పక్కింట్లో ఉండే ఓ నాలుగేళ్ల చిన్నారి ఆడుకుంటూ అతను ఉన్న రూం దగ్గరకు వచ్చింది. ఆ అమ్మాయికి చాకెట్లు ఇస్తానని ఆశ చూపిన భూపేంద్ర సింగ్ చిన్నారిని గదిలోకి తీసుకెళ్లాడు. ముక్కుపచ్చలారని బాలికపై లైంగిక దాడి చేశాడు. ఏడుస్తూ ఇంటికి వెళ్లిన అమ్మాయిని తల్లి ఏం జరిగిందని అడగడంతో జరిగిందంతా చెప్పింది. విషయం తెలుసుకున్న స్థానికులు ఎస్సైని చితకబాదారు. అనంతరం చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు. బాలికకు న్యాయం చేయాలంటూ కుటుంబసభ్యులు, స్థానికులు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు.
చిన్నారిపై పోలీసు లైంగిక దాడికి పాల్పడిన ఘటనపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు కిరోడి లాల్ మీనా స్పందించారు. బాధిత బాలిక కుటుంబసభ్యులను పరామర్శించారు. అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అశోక్ గహ్లోత్ ప్రభుత్వ అసమర్థత కారణంగానే పోలీసులు ఇలా రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. బాధిత కుంటుబానికి న్యాయం చేయడంతో పాటు పరిహారం అందిస్తామని ఎంపీ ప్రకటించారు.
लालसोट में 7 साल की दलित बच्ची के साथ पुलिसकर्मी द्वारा दुष्कर्म की घटना से लोगों में भारी आक्रोश है। मासूम को न्याय दिलाने के लिए मौके पर पहुंच गया हूं। अशोक गहलोत सरकार के नाकारापन से निरंकुश हुई पुलिस चुनाव जैसे संवेदनशील मौके पर भी ज्यादती करने से बाज नहीं आ रही। pic.twitter.com/xnIB13eyWi
— Dr.Kirodi Lal Meena (@DrKirodilalBJP) November 10, 2023