Home > క్రైమ్ > హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమారుడు కిడ్నాప్ ..?

హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమారుడు కిడ్నాప్ ..?

హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమారుడు కిడ్నాప్ ..?
X

తెలుగు రాష్ట్రాల్లో కిడ్నాప్‌లు కలకలం రేపుతున్నాయి. సినీ ఫక్కీలో కిడ్నాపర్స్ చెలరేగిపోతుండడం ఆందోళనకు గురి చేస్తోంది. గురువారం విశాఖ ఎంపీ, ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కుటుంబ సభ్యులను, వైసీపీ నాయకుడిని కిడ్నాప్ చేయడం చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై చర్చ కొనసాగుతున్న సమయంలోనే హైదరాబాద్‌లో మరో రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమారుడు అదృశ్యమవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.

మల్కాజిగిరిలో నివాసముంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమారుడు హర్షవర్ధన్.. నిన్న సాయంత్రం నుంచి కనిపించకుండా పోయాడు. ఎక్కడా వెతికినా ఫలితం కనబడలేదు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు హర్షవర్ధన్ కోసం వెతుకుతున్నారు. ఎవరైనా కిడ్నాప్ చేశారా ? అన్న కోణంలో కేసును దర్యాప్తు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి అనుమానం వ్యక్తం చేసిన పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రియల్టర్‌కు ఆర్థిక వివాదాలు ఉన్న వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఇప్పటికే బాలుడు ఆచూకీ కోసం నాలుగు టీంలు గాలిస్తున్నాయి.

Updated : 16 Jun 2023 6:20 PM IST
Tags:    
Next Story
Share it
Top