Home > క్రైమ్ > స్కూల్ బస్సును ఢీకొన్న కారు.. విద్యార్థులతోపాటు ఎమ్మెల్యే సతీమణికి గాయాలు

స్కూల్ బస్సును ఢీకొన్న కారు.. విద్యార్థులతోపాటు ఎమ్మెల్యే సతీమణికి గాయాలు

స్కూల్ బస్సును ఢీకొన్న కారు.. విద్యార్థులతోపాటు ఎమ్మెల్యే సతీమణికి గాయాలు
X

వరంగల్ రూరల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. నర్సంపేట శివారులోని కమలాపురం క్రాస్ రోడ్డు వద్ద స్కూల్ బస్సును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20 మంది విద్యార్థులతో పాటు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ సతీమణికి గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఎమ్మెల్యే సతీమణి పెద్ది స్వప్న ప్రయాణిస్తున్న కారు స్కూల్ బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ సమయంలో బస్సులో సుమారు 30మంది విద్యార్థులు ఉన్నారు.

విద్యార్థుల్లో ఐదుగురికి తీవ్రగాయాలు అవ్వగా.. మరో 15మందికి స్వల్ప గాయాలయ్యాయి. విద్యార్థులను వరంల్ ఆస్పత్రి, ఎమ్మెల్యే సతీమణిని హన్మకొండ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలాన్ని ఏసీపీ తిరుమల్ పరిశీలించి ప్రమాదంపై ఆరా తీశారు. కాగా కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. పెద్ది స్వప్న ప్రస్తుతం వరంగల్ జడ్పీ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్గా ఉన్నారు.


Updated : 9 Aug 2023 10:21 PM IST
Tags:    
Next Story
Share it
Top