వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఎస్సై మృతి
Mic Tv Desk | 18 Jun 2023 6:55 PM IST
X
X
వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎస్సై సోమ కుమారస్వామి ప్రాణాలు కోల్పోయారు. గీసుకొండ మండలంలోని హర్జితండా వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గీసుకొండ మండలం అనంతారం గ్రామానికి చెందిన సోమ కుమారస్వామి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎస్‌ఐగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన వరంగల్కు కారులో వెళ్తున్నారు.
హర్జితండా వద్ద కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొనడంతో ఎస్‌ఐ కుమారస్వామికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించినా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రమాదంలో కారు ముందు భాగం మొత్తం తుక్కుతుక్కైంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Updated : 18 Jun 2023 6:55 PM IST
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire