Home > క్రైమ్ > ముంబై ఎక్స్‌ప్రెస్ రైలులో నరమేధం.. కానిస్టేబుల్ కాల్పులు

ముంబై ఎక్స్‌ప్రెస్ రైలులో నరమేధం.. కానిస్టేబుల్ కాల్పులు

ముంబై ఎక్స్‌ప్రెస్ రైలులో నరమేధం.. కానిస్టేబుల్ కాల్పులు
X

జైపూర్ - ముంబై ఎక్స్‌ప్రెస్ రైలులో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(RPF) కానిస్టేబుల్ విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో.. ఆర్పీఫ్ ఏఎస్ఐ సహా మరో ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే చనిపోయారు. జయపుర నుంచి ముంబయి వెళ్తున్న జయపుర​ ఎక్స్​ప్రెస్ (12956)​లో ఈ దారుణం జరిగింది. . ఈ ఘటన మహారాష్ట్రలో పహల్గఢ్‌​ రైల్వే స్టేషన్​ సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది.

పాల్ఘర్ స్టేషన్ దాటిన అనంతరం రైలు వెళుతుండగానే ఆ కానిస్టేబుల్(చేతన్) ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. ఉదయం 5 గంటల సమయంలో బీ5 కోచ్‌లో ఘటన జరిగినట్టు తెలుస్తోంది. అంతా నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా కాల్పుల మోత వినిపించడంతో ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. వెంటనే సమాచారాన్ని రైల్వే అధికారులకు అందించారు. అయితే చేతన్.. దహిసర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుంచి దూకేశాడు. పోలీసులు చాకచక్యంగా అతన్ని అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.



Updated : 31 July 2023 9:07 AM IST
Tags:    
Next Story
Share it
Top