Home > క్రైమ్ > ఆంజనేయస్వామికే టోకరా.. హుండీ సొమ్మును ఎలా కొట్టేశాడో చూడండి..

ఆంజనేయస్వామికే టోకరా.. హుండీ సొమ్మును ఎలా కొట్టేశాడో చూడండి..

ఆంజనేయస్వామికే టోకరా.. హుండీ సొమ్మును ఎలా కొట్టేశాడో చూడండి..
X

ఆంజనేయస్వామి భూతప్రేతాల నుంచి, దుష్టశక్తుల నుంచి తమను కాపాడతాడని భక్తుల నమ్మకం. దుర్మార్గుల ఆటలు కట్టిస్తాడని చెబుతారు. అలాంటి శక్తిమంతుడైన దేవుడికే ఓ ప్రబుద్ధుడు టోకరా వేశారు. సుప్రసిద్ధ హనుమాన్ క్షేత్రమైన అనంతపురం జిల్లాలోని కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి గుడిలో ఇంటిదొంగ గుట్టు రట్టయింది. ఇరవై ఏళ్లుగా అక్కడ సెక్యూరిటీ చీఫ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కృష్ణారెడ్డి మంగళవారం తెల్లవారుజామున స్వామివారి హుండీని కొల్లగొడుతూ కెమెరాకు అడ్డంగా దొరికాడు. ఏకంగా ఎనిమిదిసార్లు చేతివాటం ప్రదర్శించాడు.

గుడిలో కెమెరాలు ఉన్న సంగతి తెలిసికూడా చోరీకి పాల్పడ్డం కలకలం రేపుతోంది. ఎన్నాళ్లుగా దేవుడి సొమ్మును దిగమింగుతున్నాడని పోలీసులు విచారణ జరుపుతున్నారు. సీసీకెమెరాల పాత ఫుటేజీని పరిశీలిస్తున్నారు ఆయనను వెంటనే విధుల నుంచి తొలగించామని అధికారులు చెప్పారు. కృష్ణారెడ్డి ఆలయంలో ఇతరుల పేరుపై సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడని, ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నా పైస్థాయి అధికారుల అండదండలతో ఇరవై ఏళ్లుగా తిష్ట వేశాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. చేతులు సులభంగా లోనికి పెట్టి డబ్బు కొట్టసేలా హుండీ ఉండడం వెనక కుట్ర ఉందని అంటున్నారు. నెట్టికంటి అంజన్నను దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగున ఉన్న కర్నాటక నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.

Updated : 19 Sept 2023 5:39 PM IST
Tags:    
Next Story
Share it
Top