Home > క్రైమ్ > విశాఖ స్వామీజీ నిజస్వరూపం ఇదే..రిమాండ్ రిపోర్ట్‎లో సంచలన విషయాలు

విశాఖ స్వామీజీ నిజస్వరూపం ఇదే..రిమాండ్ రిపోర్ట్‎లో సంచలన విషయాలు

విశాఖ స్వామీజీ నిజస్వరూపం ఇదే..రిమాండ్ రిపోర్ట్‎లో సంచలన విషయాలు
X

విశాఖలోని జ్ఞానానంద ఆశ్రమం ఆధ్యాత్మిక గురువు పూర్ణానంద స్వామీజీ మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం చేస్తున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు పూర్ణానంద స్వామీజీని అదుపులోకి తీసుకుని కోర్టు ముందు హాజరుపరిచారు. జులై 5వ తారీఖు వరకు కోర్టు రిమాండ్ విధించింది. ప్రస్తుతం స్వామీ సెంట్రల్ జైలులో ఊచలు లెక్కబెడుతున్నాడు. ఈ క్రమంలో తాజాగా పోలీసుల రిమాండ్ రిపోర్టులో ఎన్నో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. పూర్ణానంద స్వామీ చేసిన దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.


మరో మైనర్ బాలికను స్వామీజీ లైంగికంగా వేధించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఆ పాప గర్భం దాల్చిన అభియోగాన్ని స్వామీజీపై మోపారు. స్వామీజీ ఇద్దరు బాలికలపై అత్యాచారం చేసినట్లు ఆధారాలు కూడా లభించినట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. పోలీసులు రిపోర్ట్‌ ప్రకారం.. ఆశ్రమంలో మొత్తం 9 మంది బాలురు, 3 బాలికలు ఉన్నారు. పూర్ణానంద అర్ధరాత్రి ఎవరూలేని సమయం చూసుకుని బాలికలను నిద్రలేపి తన గదికి తీసుకెళ్లి వారిపై అత్యాచారం చేసేవాడు. ఇలా గత ఏడాది కాలంగా వారిపై అత్యాచారం చేయడంతో ఒక బాలిక గర్భం దాల్చింది. బాలికలపై అత్యాచారం చేసినట్లు ఆధారాలు కూడా లభించాయి. అంతేకాదు పాడు పని చేసి ఆపై బాలికలు ప్రెగ్నెంట్ అవ్వకుండా వారికి ట్యాబ్లెట్లను ఇచ్చేవాడని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‎లో పేర్కొన్నారు.బాలికలపై అత్యాచారం జరిగినట్టు ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదికలో వెల్లడైనట్టు తెలిపారు. ప్రస్తుతం గర్భం దాల్చిన మైనర్ బాలికను బంధువులు ఆశ్రమం నుంచి ఇంటికి తీసుకెళ్లారు.

Updated : 23 Jun 2023 12:20 PM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top