Home > క్రైమ్ > ముంబై మీరా రోడ్డు హత్య కేసులో సంచలన విషయాలు

ముంబై మీరా రోడ్డు హత్య కేసులో సంచలన విషయాలు

ముంబై మీరా రోడ్డు హత్య కేసులో సంచలన విషయాలు
X

దేశ వ్యాప్తంగా ప్రకంపలను సృష్టిస్తోన్న ముంబై మీరా రోడ్ హత్య కేసులో సంచనల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సరస్వతి వైద్యను హత్య చేసిన ఆమె లివ్ ఇన్ పార్టనర్ మనోజ్ సానే చెప్పిన విషయాలు విని పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. తనకు హెచ్ఐవీ పాజిటివ్ ఉందని, హతురాలు సర్వసతి వైద్యకు, తనకు మధ్య ఎంతో మంచి సంబంధాలు ఉన్నట్లు తెలిపాడు. హత్య అనంతరం ఆము మృతదేహాన్ని కుక్కర్ ఉడకబెట్టిన అతడు..వాటిలో కొన్ని భాగాలను వీధికుక్కలకు వేసినట్లు పోలీసులు ఎదుట వెల్లడించాడు. ఆమెతో తనకు ఎలాంటి శారీరక సంబంధం లేదని తెలిపాడు.

"సరస్వతి వైద్య నాకు కుమార్తె లాంటింది. నాతో చాలా అప్యాయంగా ఉండేది. 2008లో తాను యాక్సిండెంట్‌కు గురికావడంతో చికిత్స సమయంలో హెచ్ఐవీ ఉన్నట్టు వైద్యపరీక్షల్లో తేలింది. అప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్నాను. తాను ఐటీఐ చదువుకుని ఉద్యోగం రాకపోవడంతో రేషన్ దుకాణంలో పని చేసేవాడిని ఈ క్రమంలో 2014 నుంచి సరస్వతితో పరిచయమైంది. సరస్వతితో 10వ తరగతి పరీక్ష రాయించేందుకు మేథమెటిక్స్ చెప్పేవాడిని. సరస్వతి వైద్య ఒక అనాథని, ఆమెకు బంధువులు లేరు. అనాథ శరణాలయంలో పెరిగిన సరస్వతి అక్కడి సన్నిహితులతో మాత్రం తన అంకుల్‌తో కలిసి ఉండేది. అతడు చాలా డబ్బులున్నవాడు" అని మనోజ్ సానే పోలీసులకు వివరించాడు. అయితే సరస్వతి అనాథ అని మనోజ్ సానే చెప్పగా.. శుక్రవారం సరస్వతి చెల్లెళ్లు పోలీస్ స్టేషన్ కు వచ్చి తమ స్టేట్మెంట్‌ను రికార్డు చేయించుకున్నారు.

ఏం జరిగిందంటే..

ముంబైలోని గీతానగర్‌లో మనోజ్‌ సహానీ(56) అనే వ్యక్తి.. సరస్వతి వైద్య(36) అనే మహిళతో మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు.ఐదు రోజులు క్రితం సరస్వతితో గొడవపడి మనోజ్ ఆమెను హత్య చేశాడు. వారు ఉంటున్న ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా...విషయం వెలుగులోకి వచ్చింది. సరస్వతి హత్య అనంతరం రోజుకో పార్ట్ చొప్పున ఆమె శరీర భాగాలను నిందితుడు కుక్కర్‌లో ఉడికించి..వీధుల్లో పారవేసినట్లు గుర్తించారు. సానేతో పాటు మరో ఇద్దరు అనుమానితులను పోలీసులు కస్టడీలకి తీసుకొని విచారిస్తున్నారు. అతడి విచారణలో కీలక విషయాలు బయటపడుతున్నాయి.

Updated : 9 Jun 2023 3:45 PM GMT
Tags:    
Next Story
Share it
Top