Home > క్రైమ్ > వృద్ధురాలితో ప్రేమాయణం.. అవసరం తీరాక వదిలేసిన వైనం

వృద్ధురాలితో ప్రేమాయణం.. అవసరం తీరాక వదిలేసిన వైనం

వృద్ధురాలితో ప్రేమాయణం.. అవసరం తీరాక వదిలేసిన వైనం
X

ప్రేమకు ఎల్లలు, హద్దులుండవంటూ.. ఓ వృద్ధురాలికి మాయమాటలు చెప్పాడో వ్యక్తి. అతడి మాటలకు పొంగిపోయిన ఆమె.. సర్వస్వం ఇక నువ్వేనంటూ అతని వెంట నడిచింది. పార్క్‌లు, ప్రదేశాలు, ఫంక్షన్లు.. ఇలా ప్రతీ చోటుకి వెళ్లారు. ఇప్పటికే ఆలస్యం చేశాం.. ఇక పెళ్లిచేసుకుందామనేసరికి ఆమెను చంపేస్తానని బెదిరించాడు ఆ ప్రియుడి రూపంలో ఉన్న 70 ఏళ్ల వృద్ధుడు. . కర్ణాటకలోని బెంగుళూరు ఈ ఘటన జరిగింది.

కుమారుడికి పెళ్లి సంబంధాలు చూస్తూ.. 63 ఏళ్ల వృద్ధురాలితో ప్రేమలో పడ్డాడు. అనంతరం ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. బాధితురాలు గట్టిగా నిలదీయగా ఆమెను చంపేస్తానని బెదిరించాడు. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది వృద్ధురాలు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలి భర్త కొన్నాళ్ల క్రితం చనిపోయాడు. వృద్ధుడి భార్య కూడా మరణించింది. ఐదేళ్ల క్రితం వృద్దుడి కుమారుడికి పెళ్లి సంబంధాలు చూస్తుండగా.. వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అనంతరం వీరి సమక్షంలోనే వృద్ధుడి కుమారుడి పెళ్లి జరిగింది.

ఇద్దరు కలిసి మైసూర్​, దేవనాగరే, బెళగావి వంటి ప్రదేశాలను విహారయాత్రకు వెళ్లారు. అదే సమయంలో తనను పెళ్లి చేసుకోవాలని వృద్ధుడిని డిమాండ్​ చేసింది బాధితురాలు. మొదట్లో అందుకు ఒప్పుకున్న వృద్ధుడు.. అనంతరం నిరాకరించాడు. గట్టిగా నిలదీయగా చంపేస్తానని బెదిరించాడు. దీంతో బెంగళూరులోని తూర్పు డివిజన్​ మహిళా పోలీస్​ స్టేషన్​లో నిందితుడిపై ఆమె ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.



Updated : 22 Aug 2023 5:48 AM GMT
Tags:    
Next Story
Share it
Top