Home > క్రైమ్ > రూ.10 కోసం దారుణ హత్య..అరవింద సమేత సినిమా సీన్ రిపీట్

రూ.10 కోసం దారుణ హత్య..అరవింద సమేత సినిమా సీన్ రిపీట్

రూ.10 కోసం దారుణ హత్య..అరవింద సమేత సినిమా సీన్ రిపీట్
X

ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమాలో పేకాట అడుతుండగా రూ.5 విషయంలో వివాదం జరిగి ఫ్యాక్షన్ గొడవలకు దారి తీసిన ఘటనను చూశాం. ఇప్పుడు ఉత్తరప్రేదశ్‎లోని మెయిన్‌పురిలోనూ సేమ్ అలాంటి సీనే రిపీట్ అయ్యింది. అయితే ఇక్కడ రూ.10 విషయంలో వివాదం నెలకొనడంతో ఓ షాపు ఓనర్‎ను అత్యంత దారుణంగా హతమార్చాడు ఓ వ్యక్తి. జూన్ 12న ఈ దారుణం జరిగింది. స్థానికంగా సంచలనాన్ని సృస్టించింది. ఈ కేసును నమోదు చేసుకున్న పోలీసులు పక్షం రోజుల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. అయితే విచారణలో నిందితుడు విస్తుపోయే విషయాలను చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు.


ఘిరోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫైజ్‌పూర్ గ్రామంలో ఉంటున్న మహేశ్‌చంద్ జాతవ్ మెయిన్‌పురిలో ఓ కిరాణా సాపును నడుపుతున్నాడు. షాపులో కిరాణా సామాన్లతో పాటు పెట్రోల్‌‎ను విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో నగ్లా కెహ్రీ గ్రామానికి చెందిన ఉల్ఫాన్ అనే వ్యక్తి మహేష్ షాపులో పెట్రోల్ కొనుగోలు చేశాడు. అయితే వీరిద్దరి మధ్య రూ.10 విషయంలో వివాదం నెలకొంది. రూ.10 తక్కువగా ఉండటంతో డబ్బులు తీసుకోవడానికి మహేష్ నిరాకరించాడు. ఉల్ఫాన్ తనదగ్గర డబ్బులు లేవని, రూ.10 తగ్గించమని కోరాడు. అయినా దుకాణదారుడు వినిపించుకోలేదు. పైగా ఉల్ఫాన్‌ను బైక్ తీసుకెళ్లకుండా షాపు దగ్గరే అడ్డుకున్నాడు. తన డబ్బులు మొత్తం చెల్లించిన తరువాతే బైక్ తీసుకెళ్లాలని హెచ్చరించాడు. దీంతో చేసేదేమీ లేక నడుచుకుంటూ ఇంటికి వెళ్లి రూ.10 తీసుకువచ్చి మహేష్‎కు ఇచ్చాడు. తన బైక్‎ను తీసుకెళ్లాడు


అయితే ఈ విషయాన్ని ఉల్ఫాన్ అవమానంగా ఫీల్ అయ్యాడు. ఎలాగైనా మహేష్‎పై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. ప్లాన్ వేశాడు. అందుకుతగ్గట్లుగానే జూన్ 12 రోజు రాత్రి మహేష్ షాపు దగ్గర మంచంపై పడుకుని ఉండటం గమనించిన ఉల్ఫాన్ అక్కడికి వెళ్లాడు. తనతో తెచ్చుకున్న తుపాకీతో మహేష్ తలను పేల్చేశాడు. ఈ దారుణం జరిగిన 15 రోజుల తరువాత పోలీసులు ఉల్ఫాన్‎ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఉల్ఫాన్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Updated : 30 Jun 2023 11:53 AM IST
Tags:    
author-thhumb

Krishna

సట్టి కృష్ణ.. Mic Tv websiteలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఈయనకు జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉంది. గతంలో V6 News, CVR news,Mojo Tv, 6TV వంటి పలు ఛానళ్లలో పనిచేశారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమా, అనాలిసిస్లు రాయగలరు.


Next Story
Share it
Top