ప్రియుడి కోసం భర్తను చంపి..ముక్కలుగా నరికిన భార్య
X
మానవ సంబంధాలు బలహీనమవుతున్నాయి. ఎలాంటి సెంటిమెంట్ లేకుండా పాశవిక హత్యలకు పాల్పడుతున్న సంఘటనలు దేశవ్యాప్తంగా ఈ మధ్య తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ తన 56 ఏళ్ల భర్తను అత్యంత కిరాతకంగా ఓ భార్య చంపిన ఘటన వెలుగులకి వచ్చింది. వివాహేతర సంబంధమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ప్రియుడితో కలిసి జీవించాలనే ఉద్దేషంతో నిద్రిస్తున్న భర్తపై గొడ్డలితో దాడి చేసింది. ఆ తరువాత అతని శరీరాన్ని ఐదు ముక్కలుగా నరికి కాలువలో పడేసింది. తండ్రి కనిపించడం లేదని కొడుకు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ దారుణం బయటకు వచ్చిది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని పీలీభీత్ జిల్లాలో సోమవారం అర్తరాత్రి ఈ దారుణం జరిగింది. వివాహేతర సంబంధమే ఈ సంఘటనకు కారణంగా తెలుస్తోంది. ప్రియుడి మోజులో పడిన వివాహిత దేవి, తన భర్త 56 ఏళ్ల రాంపాల్ అడ్డు తొలగించుకొనేందుకు అత్యంత దారుణంగా గొడ్డలితో నరికి చంపింది. అంతటితో ఆగలేదు భర్త శరీరాన్ని ముక్కలుగా నరికి ఓ గోనె సంచిలో వేసి ఓ కాలువలో పడేసింది. ఎంత వెతికినా తండ్రి కనిపించకపోవడంతో మృతుడి కుమారుడు సోంపాల్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులకు భార్య దేవిపై అనుమానం రావడంతో ఆమెను విచారించారు. దీంతో తాను చేసిన నేరాన్ని దేవి ఒప్పుకుంది. దేవి చెప్పినట్లుగా రాంపాల్ డెడ్ బాడీని కాలువ నుంచి బయటకు తీసి కుమారుడికి అప్పగించారు.